• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రధాని కార్యాలయమే ఎంపీకి...

ప్రధాని కార్యాలయమే ఎంపీకి షాకిచ్చిందా?

By - Tupaki Desk
Update: 2022-07-04 05:17 GMT
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు యూ టర్న్ తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవంలో పాల్గొనేందుకు నరేంద్ర మోడీ భీమవరం వచ్చిన సందర్భంలో తాను కూడా ఉండాలని ఎంపీ అనుకున్నారు. అయితే కార్యక్రమం కోసం బయలుదేరిన ఎంపీ మధ్యలోనే రైలుదిగి తిరిగి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి ఢిల్లీ వెళ్లిపోయినట్లు సమాచారం.

ఇంతకీ విషయం ఏమిటంటే మోడి కార్యక్రమంలో తాను పాల్గొంటానని, తనను ఎవరు ఆపలేరంటు పదే పదే ఛాలెంజులు చేశారు. లేని సమస్యను ఉన్నట్లు బూతద్దంలో చూపించారు. కార్యక్రమానికి హాజరుకానీకుండా తనను జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటు కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే ఎంపీ వేసిన కేసులను కోర్టు కొట్టేసింది. ఒకవైపు కోర్టులో కేసులు వేసిన ఎంపీ మరోవైపు జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏదేమైనా తాను హాజరయ్యేది హాజరయ్యేదే దమ్ముంటే అడ్డుకోమంటు సవాళ్ళు విసిరారు.

తీరా చూస్తే కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎంపీ అక్కడి నుండి భీమవరంకు రైలులో బయలుదేరారు. అయితే మధ్యలోనే ఆయనకు ఫోన్ వచ్చింది.

దాని సారాంశం ఏమిటంటే తన మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టారని. దాంతో మనస్తాపం చెందిన ఎంపీ రైలు దిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారట. ఎంపీ మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టారో లేదో తెలీదుకానీ మోడీ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితాలో ఎంపీ పేరేలేదట.

ప్రధాని కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయమే నిర్ధారిస్తుంది. ఆ జాబితాలో ఎంపీ పేరులేదని ఏలూరు రేంజి డీఐజీ పాల రాజు చెప్పారు. జాబితాలో పేరులేనపుడు ఎంపీని కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించరు.

ఈ విషయం ఎంపీకి బాగా తెలుసు. దాంతో భీమవరం వెళ్ళినా లాభంలేదని అర్ధమైపోయి చేసేదిలేక చివరకు వెనక్కు వెళ్ళిపోయారు. అయినా ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో లోకల్ ఎంపీ పేరు లేకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. మరీ విషయాన్ని ఎంపీ ఎందుకని చెక్ చేసుకోలేదో అర్ధం కావటం లేదు.
Tags:    
  • YSRCPMP 
  • MPRaghuramaKrishnamRaju 
  • NarendraModi 
  • YSRCPGovernment 
  • YSJaganMohan 
  • EluruRangeDIGPalaRaju 
  • APPolitics 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS