అసెంబ్లీ లో మండలి రద్దు గుట్టు విప్పిన ధర్మాన

Update: 2020-01-27 07:51 GMT
ప్రజలకు మంచి చేసే నిర్ణయాలను జగన్ తీసుకుంటుంటే దాన్ని మండలి ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబు నిజస్వరూపం బయటపడుతుందనే సోమవారం అసెంబ్లీకి భయపడి రాలేదని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ఆరోపించారు. శాసనమండలి రద్దు పై ధర్మాన మాట్లాడారు.

101 దేశాల్లో శాసనమండలి సభలు లేవని.. బ్రిటీష్ వారు కొందరు తమకు అనుకూలురైన పెద్దలను మచ్చిక చేసుకోవడానికే ఈ పెద్దల సభను దేశంలో పెట్టారని ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. బ్రిటీష్ వారి వైఖరిని గాంధీ తప్పు పట్టారాన్నారు. పెద్దల పేరుతో దేశానికి కన్నం పెట్టారని ఆరోపించారన్నారు. లేని అధికారాన్ని చైర్మన్ అన్వయించుకొని బిల్లులను కొనసాగిస్తున్నారన్నారు.

54శాతం ప్రజలు ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారని.. ఆ ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను ఓడి పోయిన చంద్రబాబు మండలి ద్వారా అడ్డుకుంటున్నారని ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఇది కరెక్ట్ కాదని ధర్మాన మండి పడ్డారు.

రాజకీయ కారణాలతో బిల్లులను అడ్డుకుంటున్న టీడీపీకి చెంప పెట్టులా శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్టీ చట్టాలను ఎందుకు సెలెక్ట్ కమిటీకి పంపలేదని ధర్మాన ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇలానే ధైర్యంగా ముందుకెళ్లాలని.. ఎవరికి భయ పడవద్దని ధర్మాన సూచించారు.
Tags:    

Similar News