మోడీ-జగన్ భేటి.. ప్రధాన ఎజెండా ఇదే.!

Update: 2019-10-05 12:11 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.. ప్రధాని మోడీ నుంచి హోంమంత్రి అమిత్ షా - రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి వచ్చారు. ముఖ్యంగా గోదావరి - కృష్ణ నదుల అనుసంధానానికి కేంద్రం సాయం కోరారు. ఇక పథకాలకు నిధుల విడుదల కోసం ప్రయత్నాలు చేశారు.

ఇక ఇప్పుడు శనివారం ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని కలిసి వివిధ అంశాల పై విన్నపాలు చేసేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే 'రైతు భరోసా' పథకం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోడీని ఆహ్వానించడం ప్రధాన ఎజెండా అని తెలుస్తోంది. ఇక మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా జగన్ మోడీకి వివరించబోతున్నారట..

ముఖ్యంగా ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి ఆర్థిక సాయం చేయాలని జగన్ కోరనున్నట్టు తెలిసింది. ఇక వెనుకబడిన జిల్లాలు, ఉత్తరాంద్రకు ప్రత్యేక నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరుతారని సమాచారం. ఇక గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించే ప్రణాళికను వివరించి కేంద్రం సాయం కోరబోతున్నారు. ఇదే కాక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ పై వచ్చిన వివాదాల పై ప్రధాని మోడీకి జగన్ వివరిస్తారని తెలుస్తోంది.
Tags:    

Similar News