ఎన్టీవోడు విగ్రహానికి ఎంత అవమానమంటే..

Update: 2017-01-04 04:58 GMT
ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగువారంతా అభిమానించే నేతగాఎన్టీవోడిని చెప్పాల్సిందే. ప్రాంతీయ మరక పడని మహానేతగా ఆయన్ను చెప్పకతప్పదు. విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలంతా అభిమానించి..ఆరాధించే వ్యక్తుల్లో ఎన్టీఆర్ మొదట్లోనే ఉంటారు. అలాంటి ఎన్టీవోడి విగ్రహానికి ప్రకాశం జిల్లాలో అవమానం ఎదురైంది. గుర్తు తెలియని దుండగుల కారణంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు.. మాజీ ముఖ్యమంత్రిగా.. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారు. ఈ ఉదంతం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ ను అవమానించిన వ్యక్తుల్ని గుర్తించి..అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించి.. జన్మభూమి సభను అడ్డుకున్నారు. ప్రజలతోపాటు.. టీడీపీ నేతలు.. కార్యకర్తలు రోడ్ల మీదకు పెద్దఎత్తున వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి జరిగిన అవమానంపై మండిపడ్డారు. అనంతరం.. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసు అధికారులు హామీ ఇవ్వటంతో ఎన్టీవోడి అభిమానులు శాంతించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News