స్కూళ్లో పాఠాలు చెబుతుండగా భారీ పేలుడు

Update: 2020-10-27 08:30 GMT
పాకిస్తాన్ దేశం మరోసారి నెత్తురోడింది. పెషావర్ లోని ఒక స్కూళ్లో విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. 75మంది వరకు గాయపడ్డారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌లోని పెషవర్ లోని దిర్ కాలనీలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఖురాన్ సెమినార్ లో ఈ పేలుడు సంభవించింది.  సెమినార్ కొనసాగుతున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి బ్యాగ్ లోపల పెట్టి కొద్దిసేపు ఉండి సైలెంట్ గా వెళ్లిపోయాడు. ఈ సెమినార్ కు చిన్నపిల్లలు, విద్యార్థులే ఎక్కువగా హాజరయ్యారు.

పేలుడులో గాయపడ్డ వారిని సమీపంలోని లేడి రీడింగ్‌ ఆసుపత్రికి తరలించారు. 20 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

కాగా పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదని పాకిస్థాన్‌ పోలీసు అధికారి మన్సూర్‌ తెలిపారు. మతపరమైన శిక్షణ తరగతులు జరుగుతున్న బిల్డింగ్‌లో పేలుడు జరడం వల్ల చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. పేలుడుకు గల కారణాల కోసం అన్వేషిస్తున్నారు. బాంబుల వల్లే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని ఇంకా ఆధారాలు లభించలేదని ఉగ్రవాద చర్యల కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.

    

Tags:    

Similar News