రాజ్ భవన్ లో కరోనా కల్లోలం.. 48మందికి పాజిటివ్

Update: 2020-07-13 05:30 GMT
తెలంగాణ రాజ్ భవన్‌లో 38 మందికి పైగా సిబ్బందితో పాటు వారి 10 మంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది. గవర్నర్ తమిళైసాయి సౌందరాజన్ -ఆమె కుటుంబ సభ్యులకు  పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ట్వీట్ చేసింది.  ఆమె రెడ్ జోన్లలోని ప్రజలను పరీక్షలు చేసుకోవాలని పిలుపునిచ్చింది.

రాజ్ భవన్ లో వచ్చిన మొత్తం కేసుల్లో 38 మంది సిబ్బందిలో 28 మంది భద్రతా సిబ్బంది పోలీసులు, 10 మంది గవర్నర్ కార్యాలయంలో పనిచేసేవారు ఉన్నారు. మిగతా వారి కుటుంబ సభ్యులున్నారు.  

వైద్యసిబ్బంది గవర్నర్, రాజ్ భవన్ లోని సిబ్బందితో సహా మొత్తం 39 మంది  నమూనాలను సేకరించారు. 48మందికి పాజిటివ్ గా తేలింది. మిగిలిన 347 పరీక్షలు నెగెటివ్ గా ఉన్నాయి.

పాజిటివ్ రోగులలో 20 మందిని   ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపారు. మిగిలిన వారు హోం క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు.

తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో, స్వయంగా వైద్యురాలు అయిన గవర్నర్ తమిళ్ సై సౌందరాజన్ రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆమె నిమ్స్ ఆస్పత్రిని సందర్శించింది. ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రులతో చర్చలు జరిపారు.
Tags:    

Similar News