• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 27 గురువారం 2018...

డిసెంబరు 27 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-27 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: రాబడి అంతగా లేకపోయినా అవసరాలు తీరతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో చికాకులు ఎదురైనా కొంతమేర అధిగమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. వ్యాపారాలు సామన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మనశ్శాంతి లోపం. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం కొత్త రుణాల వల్ల ఆర్థికంగా బలపడుతారు. బంధువులతో విరోధాలు. భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాల్లో చికాకులు. పారిశ్రామిక - కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. ఉద్యోగులకు ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. విద్యార్థుల అంచనాలు తారుమారవుతాయి. మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు. వినాయకుడిని పూజించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శుభవార్త  సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు - రియల్టర్లకు ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు నూతన అవకాశాలు. ఐటీ నిపుణులకు సమస్యలు తీరతాయి. మహిళలకు స్వల్ప ధనలాభం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడినా కొన్ని పనులు పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు కార్యసాధనలో ఇబ్బందులు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కొంత అశాంతి. నృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్ల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి. ఉద్యోగులకు ఊహించని విధంగా ప్రయోజనాలు. కళాకారులకు ఆశాజనకం. ఐటీనిపుణులకు శుభ సమాచారం. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: ఆదాయానికి మించి ఖర్చులు. కుటుంబంలో చికాకులు ఎదురైనా మీ సమర్థతతో అధిగమిస్తారు. ఇంటాబయటా విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు పని ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

తులారాశి: ఆదాయం సంతృప్తికరం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టర్లు. రియల్టర్ల యత్నాలు సానుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ వేత్తలకు కలిసొచ్చే కాలం. ఐటీ నిపుణుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు శుభ సమాచారం అందుతుంది. మహిళలకు భూలాభాలు. శ్రీరామ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాల్లో ఉన్నతి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సజావుగా పూర్తి చేస్తారు. రియల్టర్లకు అనుకూల సమాచారం. ఉద్యోగులకు చిక్కులు తొలిగే సమయం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. ఆంజనేయదండకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. అప్రయత్నంగా కొంత సొమ్ము అందుతుంది. రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థాన మార్పు సూచనలు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి గందరగోళం. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. శివాష్టకం పఠించడం మంచిది.

మకర రాశి: ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువులతో విరోధాలు. వ్యవహారాల్లో ఆటంకాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఒక సమాచారం గందరగోళ పరుస్తుంది. వ్యాపారాల్లో నిదానం అవసరం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కుంభరాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. రియల్లర్ల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల, రియల్టర్ల యత్నాలు సఫలం. ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలు కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. కార్యజయం. శుభవర్తమానాలు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. కోర్టు కేసుల నుంచి విముక్తి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. కొత్త వ్యాపారాలు చేపట్టే వీలుంది. ఉద్యోగాల్లో ఉత్సాహం. రాజకీయవేత్తలకు యోగదాయకంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు ఆశాజనకం. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత. వినాయకుడిని పూజించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జీవితాలను తాకట్టు పెడుతున్నారా?

2026-11-13 19:30 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

Copyright @2026

Powered by Blink CMS