• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 16 ఆదివారం 2018...

డిసెంబరు 16 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-16 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువులతో విరోధాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని సమస్యలు వేధిస్తాయి. రాబడి తగ్గుతాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణులకు ఫలితం లభించదు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. విద్యార్థులక ఆటంకాలు. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
 
వ‌ృషభ రాశి: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. యత్న కార్యసిద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. కళాకారులకు అవార్డులు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. మహిళలకు ఆస్తి లాభం. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: వ్యవహారాల్లో ముందంజ. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహం. కొత్త వ్యాపారాలు చేపడుతారు. ఉద్యోగులకు ఆశాజనకం. కళాకారులు, కాంట్రాక్టర్లకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు శుభవార్తలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ధన లబ్ధి. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: బంధువర్గంతో మాటపట్టింపులు, ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ పాటించండి. మిత్రులతో రాజీకి యత్నిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థుల యత్నాల్లో విఘాతం. మహిళలకు మానసిక ఆందోళన. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: మిత్రులతో తగాదాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. కళాకారులకు అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు ప్రోత్సాహం అంతగా కనిపించదు. విద్యార్థులు శ్రమించాలి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండుమూడు విధాలుగా ధనలాభం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటా బయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ వేత్తలకు సన్మానాలు. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. మహిళలకు శుభవార్తలు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.
 
తులారాశి: సంఘంలో విశేష గౌరవం. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. భార్యభర్తల మధ్య సర్దుబాటు వైఖరి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల పరిస్థితి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు. ఐటీ నిపుణులకు కీలక సమాచారం. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి: రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి. రియల్టర్లకు నిరాశ. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ వేత్తలకు నిరాశాజనకం. ఐటీ నిపుణుల అంచనాల్లో పొరపాట్లు. విద్యార్థులకు గందరగోళం. మహిళకు నిరుత్సాహం. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. కుటుంబ సమస్యలు మీతో విబేధించవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. శివాష్టకం పఠించడం మంచిది.

మకర రాశి: పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, ఐటీ రంగాల వారికి శుభవార్తలు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. కనక దుర్గాదేవీని పూజించడం మంచిది.

కుంభరాశి: రాబడికి మించి ఖర్చులు. పనులు నత్తనడకన సాగుతాయి. కొన్ని సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. కళాకారులకు నిరాశ. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. మహిళలకు కుటుంబంలో చికాకులు. వినాయకుడికి అర్చన చేయడం మంచిది.

మీనరాశి: ఆదాయం పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. వ్యాపారాల్లో పెట్టుబడులకు అవకాశం. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు అనుకూలం. విద్యార్థులకు ప్రోత్సాహం. మహిళలకు ఆస్తి లాభం. దత్తాత్రేయుడి స్తోత్రాలు పఠించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS