• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 4 మంగళవారం 2018...

డిసెంబరు 4 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-04 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో విశేష ఆదరణ. నూతన ఉద్యోగయోగం. రియల్ ఎస్టేట్ వారికి భూలాభాలు కలుగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరం. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పారిశ్రామిక వర్గాలవారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. సీనీ కళాకారులు మంచి గుర్తింపు పొందుతారు. మహిళలకు ఆస్తిలాభం. హనుమాన్కు గంధసింధూరం పూజ చేయండి.

వ‌ృషభ రాశి: రాబడి సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు. రియల్టర్లకు నూతనోత్సాహం. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలకు అరుదైన ఆహ్వానాలు. ఐటీ రంగం వారికి చెప్పుకోదగిన అభివృద్ధి. సినీ కళాకారులు  అవకాశాలు అందిపుచ్చుకుంటారు. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలుగుతుంది. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. దత్తాత్రేయుడి స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి: రాబడి తగ్గే అవకాశం. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు రాక నిరాశ చెందుతారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు నిరాశజనకం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. గణపతిని గరికలతో పూజించండి.

కర్కాటక రాశి: పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు. ఉద్యోగాల్లో అప్రమత్తతం అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తప్పవు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండదు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి: మెండి బకాయిలు వసూలవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు.  శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ రంగం వారికి పురోగతి కనిపిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి. విద్యార్థులకు  ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శివాలయంలో అభిషేకం నిర్వహించండి.

కన్యరాశి: భూవివాదాలు చికాకు పరుస్తాయి. శారీరక రుగ్మతలు. ఆదాయం అంతంత మాత్రమే. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు స్థాన మార్పులు తథ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామిక వర్గాలవారు నిదానంగా వ్యవహరించాలి. ఐటీరంగం వారికి తొందరపాటు నిర్ణయాలు తగదు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
 
తులారాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం. బంధువర్గం నుంచి విలువైన సమాచారం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు కలిసివచ్చే కాలం. ఐటీ రంగం వారికి పైస్థాయి నుంచి ప్రశంసలు. విద్యార్థులకు అనుహ్యమైన విజయాలు దక్కుతాయి. మహిళలకు సోదరుల నుంచి మాట సహాయం. వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి: పాతమిత్రులను కలుసుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రమ పెరుగుతుంది. భాగస్వాములతో వివాదాలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు అంతగా లభించవు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. రాజకీయ వేత్తలకు గందరగోళం. ఐటీ రంగంవారికి ఒత్తిడులు. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. శ్రీరామ నామాలను జపించండి.

ధనస్సు రాశి: ప్రముఖులతో పరిచయాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు సాఫీగా జరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు. మహిళలు శుభకార్యాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచింది.

మకర రాశి: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. నూతన పనులు చేపడుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. మహిళలకు కుటుంబంలో ఆదరణ. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది.

కుంభరాశి: మిత్రులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. కొన్ని వ్యవహారాలు అంచనాలు తప్పుతాయి. కొన్ని అపవాదులు భరించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. ఉద్యోగులకు చికాకులు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మానసిక ఆందోళన, ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు పనుల్లో ఆటంకాలు. మహిళలకు జీవిత భాగస్వామితో నిరాశ తప్పదు. సూర్యారాధన మంచిది.

మీనరాశి: దూర ప్రయాణాలు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాల్లో అంచనాలు తప్పుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి వివాదాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. వివాదాలకు దూరంగా మెలగండి. పారిశ్రామిక, వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఐటీ నిఫుణులు శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబంలో సమస్యలు. ఆంజనేయ స్వామిని పూజించండి మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS