• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 30 శుక్రవారం 2018...

నవంబర్ 30 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-30 01:31 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకం. దూరపు బంధువుల నుంచి ఒత్తిడులు. ఆప్తులతో తగదాలు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు. పారిశ్రామిక వేత్తలు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఐటీ నిపుణులు తొందరపడ్డద్దు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

వ‌ృషభ రాశి: రాబడి ఆశించిన స్థాయిలోలేక రుణాలు చేస్తారు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులతోపాటు కొందరికి స్థానచలన సూచనలు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి చికాకులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహం తగ్గుతుంది. విద్యార్థులు మరింత కృషి చేయాలి. దూర ప్రయాణాలు చేస్తారు. మహిళలకు మానసిక ఆందోళన. గణపతిని పూజించండి.

మిథున రాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఊహించని రీతిలో కాంట్రాక్టులు పొందుతారు. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు నూతనోత్సాహం.  ఐటీ నిపుణుల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మహిళలకు శుభవర్తమానాలు. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటక రాశి: ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు. వ్యాపారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలకు కుటుంబపరంగా చికాకులు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి: జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. ఐటీ నిపుణులు విజయాల వైపు సాగుతారు. విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. హనుమాన్ పూజలు మంచిది.

కన్యరాశి: శ్రమకు తగిన ఫలితం వస్తుంది. మిత్రుల నుంచి ధన, మాట సహాయం కోరతారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమే. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు. విద్యార్థుల పరిశోధనలు ముందుకు సాగవు. మహిళలకు నిరాశాజనకమే. ఆదిత్య హృదయం పఠించండి.

తులారాశి: వివాహా, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశాలు. ఐటీ నిపుణులకు మరింత ఆశాజనకం. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటుకు అనుకూలిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పరిష్కారమవుతాయి. మహిళలకు శుభవార్తలు. దుర్గాదేవీని పూజించాలి.

వృశ్చిక రాశి: ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ప్రయాణాలు సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. మహిళలకు ఆస్తి లాభం. హనుమాన్ చాలీసా పఠించండి.

ధనస్సు రాశి: ఆకస్మిక ప్రయాణాలు సంభవం. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కష్టపడినా ఫలితం ఉండదు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. పెట్టుబడుల్లో నిదానం పాటించండి. ఉద్యోగులకు బదిలీలు జరగవచ్చు. పారిశ్రామిక వర్గాలవారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివాలయంలో అభిషేకం చేయించండి.

మకర రాశి:  కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. రియల్టర్లు - కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు సవాలుగా మారే సూచనలు. పారిశ్రామిక - రాజకీయ రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాలి. గణపతికి అభిషేకం చేయించండి.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. కొత్త పనులకు శ్రీకారం చూడతారు. ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపార లావాదేవీల్లో పురోగతి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

మీనరాశి: సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు తధ్యం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు ప్రయత్నాల్లో విజయం. వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. రెండు మూడు విధాలుగా ధనలాభం. ఉద్యోగులకు పదోన్నతి. మహిళలకు శుభ వర్తమానాలు. విష్ణు ధ్యానం చేయండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS