• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 29 గురువారం 2018...

నవంబర్ 29 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-29 01:42 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి:  బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు - ఐటీ నిపుణులకు తొందరపాటు తగదు. పారిశ్రామిక - కళారంగాల వారికి వ్యయప్రయాసలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

వ‌ృషభ రాశి: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. గతంలో చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. రాజకీయ - కళారంగాల వారికి అప్రయత్న అవకాశాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు అనుకూల సమయం. విష్ణు ధ్యానం చేయండి.

మిథున రాశి: రాబడి తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. బంధుగణంతో చర్చలు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ అంతగా కలిసిరావు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. కళాకారులు,  రాజకీయ రంగాల వారికి నిరాశ. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. ఐటీ నిపుణులకు చికాకులు. మహిళలకు సోదరులతో వివాదాలు. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి: నూతన ఉద్యోగావకాశాలు. రావాల్సిన బాకీలు సకాలంలో అందుతాయి. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగాల్లో పదోన్నతులు. కళాకారులు, రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహ రాశి: శత్రువులు మిత్రులుగా మారతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడిన కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ నిపుణులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకం. మహిళలకు సమస్యలు తీరుతాయి. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి: బంధువర్గంతో అకారణ వైరం. ఆర్థిక పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తుంది. నూతన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా  ఉంటాయి. ఉద్యోగ, ఐటీ నిపుణులకు మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు నిరాశ. రాజకీయ - కళారంగాల వారికి చికాకులు. మహిళలకు సోదరులతో విబేధాలు. చంద్ర గ్రహ స్తోత్రాలు పఠించండి.

తులారాశి: కుటుంబ సభ్యులతో విబేధాలు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం రాదు. విద్యార్థులకు నిరుత్సాహం. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అశాంతి. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

వృశ్చిక రాశి: పాత మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులు, రాజకీయ నేతల లక్ష్యాలు నెరవేరతాయి. ఆర్థిక వ్యవహారాలలో ముందుడుగు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఐటీ నిపుణులకు యత్న కార్యసిద్ధి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. మహిళలకు భూ లాభాలు. శ్రీ రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి: శుభవార్తలు వింటారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆదాయం పెరిగి ఊరట లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి విముక్తి. వ్యాపారాల పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. పారిశ్రామిక, కళారంగాల వారికి ప్రోత్సాహం. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. బుధగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకర రాశి: ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుంది. సన్నిహితులే సమస్యలు సృష్టిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రాబడి అంతగా ఉండదు. ఇంటి పరిస్థితులు గందరగోళం. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడులు. రాజకీయ, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఒడిదుడుకులు. మహిళలకు మానసిక అశాంతి. గాయత్రీ ధ్యానం చేయండి.

కుంభరాశి: కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆర్థిక విషయాల్లో ఒత్తిడులు. కొన్ని పనులు శ్రమతో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. ఐటీ నిపుణులు అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామిక, కళారంగాల వారికి శ్రమపడితే ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. కనకదుర్గాదేవీని పూజించండి.

మీనరాశి: చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. భూ,గృహ యోగాలు కలిగే అవకాశం. ఉద్యోగయత్నాలు అనుకూలించే సమయం. రాబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. కుటుంబ సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయ - కళారంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS