• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 4 ఆదివారం 2018...

నవంబర్ 4 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-04 01:45 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: కొత్త కాంట్రాక్టులు చేపడుతారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. ఉద్యోగయత్నాల్లో ముందడుగు.  భూములు - వాహనాలు కొంటారు. ఐటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు  తొలుగుతాయి. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలకు ఆస్తిలాభం. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభరాశి: రాబడి అంతగా ఉండదు. భూవివాదాలు.వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాల్లో నిరాశ. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదాపడుతాయి. ఐటీ నిపుణులకు తొందరపడొద్దు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్యభంగం. నృసింహస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆరోగ్యం దెబ్బతింటుంది. పనుల్లో ఆటంకాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామిక - సాంకేతిక రంగాల వారికి ఉత్సాహం తగ్గుతుంది. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు. మహిళలకు కొంత నిరాశ. నరసింహస్వామిని పూజిస్తే మంచిది.

కర్కాటకరాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు. ప్రతిభకు గుర్తింపు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తొలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక - వైద్య రంగాల వారు అవకాశాలు దక్కించుకుంటారు. ఐటీ నిపుణులకు అంతగా అనుకూలించదు. విద్యార్థులకు చికాకులు తొలిగి ఊరట.. మహిళలకు ఆస్తిలాభాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహరాశి: శారీరక రుగ్మతలు వేధిస్తాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. దూర ప్రయాణాలుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారులు నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు గందరగోళం. మహిళలకు కుటుంబ సమస్యలు రాఘవేంద్రస్వామిని పూజిస్తే మంచిది.

కన్యరాశి: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులకు పరిశోధనల్లో అనుకూల ఫలితాలు. మహిళలు శుభవర్తమానాలు అందుతాయి. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి:  ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాల్లో పొరపాట్లు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక - వైద్యరంగాల వారికి చికాకులు. ఐటీ నిపుణుల యత్నాలు ఫలించవు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక ఆందోలన. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థలాలు, వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు అనుకూలురవుతారు. రియల్ ఎస్టేట్ ల వారికి ఉత్సాహవంతమైన రోజు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణుల అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. దుర్గా స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనాలు - ఆభరణాలు కొంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అదనపు రాబడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మరింత ఉత్సాహం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయ - వైద్య రంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మకరరాశి: రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. శ్రమ మరింతగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపం. ఆరోగ్యపరమైన చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి ఆటుపోట్లు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతి బంధకాలు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక అశాంతి. రామరక్షా స్తోత్రం పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి తరఫు నుంచి సమస్యలు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు చికాకులు. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు. విద్యార్థులకు కొంత నిరాశ. మహిళలు ఆస్తి వివాదాలు. గణపతిని పూజిస్తే మంచిది.

మీనరాశి: పనులు పూర్తి చేస్తారు. దీర్గకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల ఫలితాలు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ - వైద్య రంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

Copyright @2026

Powered by Blink CMS