• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 9 మంగళవారం 2018...

అక్టోబర్ 9 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-09 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. పందాలు - పోటీల్లో పాల్గొంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు సంతృప్తినివ్వవు. మీ ధైర్యసాహసాలకు - కార్యదీక్షకు మంచి గుర్తింపు - గౌరవం లభిస్తాయి. స్త్రీలకు వ్యాపకాలు - నూతన పరిచయాలవుతాయి.

వృషభరాశి: సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్పత్రులు - వ్యవసాయం - పరిశ్రమలు - హోటల్  - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు - వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. బంధువుల రాక. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.

మిథునరాశి: ప్రియమైన వారి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రతిభకు గుర్తింపు లభించదు. పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. షాపింగ్ అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి - గుర్తింపు - సదావకాశాలు. హామీలు - ఇతరులకు ధనసహాయం విషయంలో పునరాలోచన అవసరం. పనివారితో ఇబ్బందులు. శత్రువులు మిత్రులవుతారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అనుకూలమైన సమయం.

కర్కాటకరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మాతృవర్గీయులకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెడతారు. బదిలీలు, మార్పుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మొండివైఖరితో ఇబ్బందులు. కొబ్బరి - పండ్లు - పూలు - చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. రాజకీయ రంగాలలో వారికి ప్రభుత్వం నుంచి పిలుపు. కుటుంబసభ్యులతో గొడవలవుతాయి.

సింహరాశి: సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్ - ఫోన్ సందేశాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చర్చలు - సమావేశాల్లో తొందరపాటు తగదు. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.  సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రింటింగ్ - స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఏసీ కూలర్ మెకానిక్ రంగాల్లో వారికి సంతృప్తి కనిపిస్తుంది.

కన్యరాశి: షాపింగ్ లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యత గమనించాలి. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈరోజు మీకు సహకరించే వారుండరు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. శాస్త్ర సాంకేతిక - వైద్య రంగాల వారికి గుర్తింపు. హోటల్ - క్యాటరింగ్ పనివాళ్లకు పనిభారం.

తులరాశి: ఆలోచనలు సమీక్షించుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కొలిక్కి వస్తాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. ఈరోజు వస్త్ర వ్యాపారులు పనివాళ్లను కనిపెట్టుకుండండి. స్త్రీలు నరాలు - ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికరాశి: ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. సినీ  - రాజకీయ - న్యాయ - బోధన రంగాల వారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. వినోదం - ఫొటోగ్రఫీ - రచనా రంగాల వారికి అనుకూలం. వేడుకలు - ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. పండ్లు - పూలు - కొబ్బరి - చల్లని పానీయాల వ్యాపారులకు లాభదాయకం. పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మొండీ బాకీలు వసూలవుతాయి. స్త్రీలకు పనిభారం. ఆహార వ్యవహారాల్లో పరిమితి అవసరం.

ధనుస్సురాశి: ఆర్థిక విషయాల్లో మనస్తాపం కలుగుతుంది. సమావేశాల్లో - బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. సహకార సంఘాలు - యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. బంధువుల నుంచి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయాల్లోని వారికి విరోధులతో ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొంటారు. కంపెనీల్లో పనిచేసేవారికి సంతృప్తి కనిపిస్తుంది. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. చిన్నారుల కోసం నూతన పథకాలు వేస్తారు.

మకరరాశి: పెద్దలు ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. పదిమందిలో పేరు గడిస్తారు. పెద్దల వైఖరితో మనస్తాపం. ఆర్థికంగా ఎదిగే ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. దూరప్రయాణం మంచిదికాదు. వస్తువులు - ఆభరణాలు కొంటారు.  మిత్రుల ధోరణితో ఆందోళన.

కుంభరాశి: చర్చల్లో నిదానం అవసరం. న్యాయ - బోధన -రక్షణ - రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. వేడుకలు - ఉత్సాహాల్లో పాల్గొంటారు. అంచనాలు తప్పుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త. ఏసీ - కూలర్ మెకానిక్ రంగాల వారికి సంతృప్తి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు.

మీనరాశి: వాయిదా పద్దతులపై వస్తువులు కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహం. గతించిన వ్యక్తులు స్మరించుకుంటారు. దైర్యసాహసాలకు గుర్తింపు. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS