• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 6 శనివారం 2018...

అక్టోబర్ 6 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-06 01:28 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విందు - వినోదాల్లో పరిమితి పాటించాలి. వృత్తి - వ్యాపారాల్లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు ఉపయోగపడతాయి. శ్రమాధిక్యం - విశ్రాంతిలోపం - అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.  ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు.. మత్స్య - కోళ్ల - గొర్రెల వ్యాపారస్థులకు కలిగిరాగలదు. నూతన పరిచయాలు - వ్యాపకాలు అధికమవుతాయి.

వృషభ రాశి: కృషి రంగంలో కొత్త అనుబంధాలు ఏర్పడుతాయి. వృత్తిపరమైన శిక్షణలో పాల్గొనేందుకు అనుకూలం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలవరపడుతుంది. ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో మనస్తాపం చెందుతారు. విద్యార్థులు అల్లర్లు - ఆందోళనలకు దూరంగా ఉండడం క్షేమదాయకం.  ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు సంతృప్తి - మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.

మిథునరాశి: ఇంట్లో వేడుకలు - సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రియమైన వారి వైఖరి మార్పు ఆవేదన కలిగిస్తుంది.బదిలీలు - మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నిదానం అవసరం. ఈరోజు మీ కోపాన్ని - చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు - బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు.

కర్కాటకరాశి: ఒక వార్త కలవరపెడుతుంది. రవాణా - ఏజెన్సీలు - స్టేషనరీ - బోధన రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. సోదరీ - సోదరుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.  ముఖ్యులతో ఓర్పు - విజ్ఞతాయుతంగా వ్యవహరించండి.

సింహరాశి: రుణాలు - పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితులకు డబ్బు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక సమాచారం కలవరపెడుతుంది. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టరాదు.

కన్యరాశి:అనుకున్న నిధులు సకాలంలో చేతికి అందుతాయి. లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. అనుకున్న నిధులు సకాలంలో చేతికి అందుతాయి. పెట్టుబడులు - పొదుపు పథకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. హోటల్ - క్యాటరింగ్ రంగాల్లో పనివారితో ఇబ్బందులు.

తులరాశి: గ్రాఫైట్ - ఫొటోగ్రఫీ - టెక్స్ టైల్స్ - బోధన రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాల్లో లక్ష్యసాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సోదరీ సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. కొన్ని సమస్యలతో మనశ్శాంతి దూరం చేస్తారు. వాహనం నడిపినప్పుడు జాగ్రత్త అవసరం.

వృశ్చికరాశి: ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రదర్శనలు - ఉత్సవాల్లో పాల్గొంటారు. సన్నిహితులకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలకు అశాంతికి కారణం అవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఉద్యోగస్థులు విశ్రాంతి కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ట్రాన్స్ పోర్ట్ - ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.

ధనురాశి: జన సంబంధాలు విస్తరిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ - వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. విలువైన వస్తువులు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు క్రీడారంగాల్లో బాగా రాణిస్తారు. ఖర్చులు ఊహించినవే కావడంతో కావలసిన ధనం కూడా సిద్ధం చేసుకుంటారు.

మకరరాశి: బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు. భవిష్యత్ గురించి వ్యూహరచన చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. వస్త్ర వ్యాపారులు పనివాళ్లకు కనిపెట్టుకొని ఉండడం శ్రేయస్కారం. సొంత నిర్ణయాలతో కలహాలు - చికాకులు. రాజకీయ నాయకులు సాంఘిక కార్యక్రమాల్లో - వేడుకల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి.

కుంభరాశి: గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. పాత వస్తువుల రవాణాకు అనుకూలం. పన్నుల వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. రుణప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. హోటల్ - క్యాటరింగ్ రంగాల్లో వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రవాణా రంగాల్లో ప్రయాణికులతో ఒత్తిడి - చికాకులు వంటివి తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.

మీనరాశి: ప్రియమైన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడులు - పందాలు - పోటీల్లో నష్టం సంభవం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడుతారు. కోల్ల - గొర్రె - మత్స్య వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన బాకీలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS