• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 2 మంగళవారం 2018...

అక్టోబర్ 2 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-02 01:42 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
  
మేషరాశి: భార్య/భర్త వైఖరితో ఆవేదన కలుగుతుంది. వేడుకల్లో అపశృతులు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.  మనశ్శాంతి లోపిస్తుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త.  కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు సంతృప్తినివ్వవు.  మీ ధైర్య సాహసాలకు -  కార్యదీక్షకు మంచి గౌరవం - గుర్తింపు లభిస్తాయి. స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు.

వృషభరాశి: సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మార్కెటింగ్, బోధన, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ అవసరం. బంధువుల రాకతో సందడి. అనుకోని అతిథుల ద్వారా ముఖ్య విషయాలు గ్రహిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు.

మిథునరాశి: ప్రియమైన చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరం. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సృజనాత్మకత రంగాల వారికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. హామీలు - ధన సహాయం విషయంలో జాగ్రత్త వహించాలి. కింది స్థాయి వారితో ఇబ్బందులు. శత్రువులు, మిత్రులుగా మారుతారు. చిన్న పరిశ్రమల వారికి అనుకూలం.

కర్కాటకరాశి:  వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. మీ మనసు మార్పు కోరుకుంటుంది. డాక్టర్లకు అనుకూలం. జీవిత భాగస్వామి మొండి వైఖరితో నిరుత్సాహం. కొబ్బరి - పండ్లు - పూలు - చల్లని పానీయాల వ్యాపారులకు లాభదాయకం. రాజకీయ రంగాల్లోని వారికి మంచి పిలుపు అందుతుంది.

సింహరాశి: సినీ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. చర్చలు - ప్రయాణాల్లో నిదానం అవసరం. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. రవాణా - బోధన రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ప్రింటింగ్ - స్టేషనరీ రంగాల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానం అందుతుంది.

కన్యరాశి: సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో  పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. వాహనాలు ఇతరులకు ఇస్తే ఇబ్బందులు. శాస్త్రసాంకేతిక - వైద్య రంగాలవారికి మంచి గుర్తింపు.హొటల్ - క్యాటరింగ్ పనివాళ్లకు పనిభారం అధికమవుతుంది.

తులరాశి: ఉన్నత పదవుల కోసం ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి. ప్రముఖులను కలుసుకుంటారు. కొత్త ప్రణాళికలు అమలు చేసే విషయంలో జాగ్రత్త. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వస్త్ర వ్యాపారులు పనివాళ్లతో జాగ్రత్త.

వృశ్చికరాశి: ఉన్నత విద్య, దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బోధన - వాణిజ్యం  - అడ్వర్టయిజ్ మెంట్లు - కళలు - ఫొటో గ్రఫీ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు - చర్చల్లో అసౌకర్యం తప్పక పోవచ్చు. విద్యార్థులు ఇతర వాహనాలు నడిపితే ఇబ్బందులు. పూలు - పండ్లు - కొబ్బరి - చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. మొండి బాకీలు తీరుతాయి. స్త్రీలకు పనిభారం.

ధనురాశి: ప్రియమైన వారి కోసం వస్తువులు కొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి.  రాజకీయ శత్రువులను తెలివితో ఎదుర్కొంటారు. ఉద్యోగులకు సంతృప్తి. వ్యాపారులు పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. బంధువుల నుంచి ఇబ్బందులు.

మకరరాశి: కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో మాట పడాల్సి వస్తుంది. అంచనాలు, పెట్టుబడుల్లో నిదానం అవసరం. ఆర్థిక విషయంలో భాగస్వామి వైఖరి మనస్తాపం.   ఖర్చులు, అంచనాలు మించిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు వద్దు.

కుంభరాశి: ఆరోొగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వృత్తిపరమైన సమావేశాలు, చర్చల్లో అసౌకర్యం తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించడం కష్టం. ఇంటర్వ్యూల్లో ఆశించిన ఫలితం రాకపోవచ్చు. స్త్రీలకు పంటింటిపై మమకారం పెరుగుతుంది.  ముఖ్యమైన వ్యవహారాల్లో ఎక్కడో పొరపాటు చోటుచేసుకుంటుంది. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కనిపిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

మీనరాశి: షాపింగ్, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. విలువైన వస్తువులు కోల్పోతారు.  ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురుణలో ఇబ్బందులు. కోర్టు వ్యవహారాలు ముందుకుసాగవు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు. సంతానం కోసం శ్రమిస్తారు.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS