• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 1 సోమవారం 2018...

అక్టోబర్ 1 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-01 01:32 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: ప్రింటింగ్ - స్టేషనరీ - కమ్యూనికేషన్ల రంగాల వారికి శుభప్రదం. ప్రియమైన వారితో ఉల్లాసంగా గడుపుతారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. శుభవార్త అందుకుంటారు. వేడకల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

వృషభరాశి: బ్యాంకులు - ఆర్థిక సంస్థలు - చిట్ ఫండ్ లలో పనిచేసే వారికి ప్రోత్సాహకరం. సహోద్యోగుల ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రమోషన్లు - ఇంక్రిమెంట్లకు అనుకూలం. కీలక విషయాల్లో పురోగతి. ఈరోజు మనో సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు ఆరాధన శుభప్రదం.

మిథునరాశి: ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతతి విషయాల్లో శుభప్రదం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. చిట్ ఫండ్ లు - పొదుపు పథకాలు లాభిస్తాయి.  శత్రువుల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మంచి మనసుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకరాశి: రాజకీయ - సినీ రంగాల వారు కీలక పదవులు అందుకుంటారు. వేడుకలు - బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. దూరంలో ఉన్న ప్రియమైన వారిని ఇల్లు చేరుతారు.  ఈరోజు మంచి రోజు. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇష్టదైవరాధనతో శుభప్రదం.

సింహరాశి:  బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.  కొత్త స్నేహాలు చిగురిస్తాయి.  బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు - చర్చలు ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తీరుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం.

కన్యరాశి: ప్రమోషన్లకు అనుకూలం. లక్ష్యం నెరవేరుతుంది. ప్రముఖుల్ని కలుసుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

తులరాశి: న్యాయ - బోధన - రవాణా రంగాల వారికి అనుకూలం. కొత్త వ్యూహాలు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ప్రత్యర్థులపై విజయం. నూతన ప్రాజెక్టులు విజయవంతంగా చేపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. చర్చాగోష్టుల్లో చురుకుగా  పాల్గొంటారు.

వృశ్చికరాశి: యోగ - ధ్యానాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. సంస్మరణలు, ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. వృత్తి - వ్యాపారాల్లో ఆటుపోట్లు. సోదరుల నుంచి ధనలాభం. ఆర్థిక పరిస్థితి అనుకూలం.

ధనురాశి: పందాలు - పోటీల్లో విజయం సాధిస్తారు. సమావేశాల్లో ఉల్లాసం . ప్రియమైన వారి కోసం వస్తువులు కొంటారు. బృంద కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.

మకరరాశి: ఆస్పత్రులు - ఫార్మా - రెస్టారెంట్లు - రిక్రియేషన్ రంగాల వారు పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యవసాయం - పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు - వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ - కళా - పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సాంకేతిక విద్యావకాశాలు అందుకుంటారు. సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు. రుణాలు తీరుస్తారు.

కుంభరాశి: బంధుమిత్రులతో సమావేశాలు - వేడుకల్లో పాల్గొంటారు. ప్రియమైన వారికి సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. వాహనయోగం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.పోటీపరీక్షలు - ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.

మీనరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సమీక్షలకు అనుకూలం. గృహావసరాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.


Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS