• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 29 శనివారం...

సెప్టెంబర్ 29 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-29 01:37 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. వైద్యులకు జాగ్రత్త అవసరం. అసూయపడేవారు ఎక్కువవుతారు. స్త్రీలకు స్వయం సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి, సామార్థ్యాలను పెంచుకుంటారు. కాలంతో పోటీపడి పనిచేస్తారు.

వృషభరాశి:  పరిశ్రమలు, వైద్య రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విందు, వినోదాలలో పరిమితి పాటించాలి. ఉద్యోగులు, కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్వార్థపూరిత ఆలోచనలున్న వారికి దూరంగా ఉండండి.. స్త్రీలకు గుర్తింపు. వ్యాపార వ్యవహారాల్లో మెలగండి. కొత్త పరిచయాలు ఉన్నతికి నాంది పలుకుతాయి.

మిథునరాశి: ప్రియమైన వారి నుంచి కీలక సమాచారం. సినీ రాజకీయ , న్యాయ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. ప్రయాణాలు - చర్చలు - వేడుకల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. దూరంలో ఉన్న ప్రియతముల ఇల్లు చేరతారు.  ఈరోజు హామీలు - చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.  ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు క్షేమదాయకం కాదు. సహకార, ప్రైవేటు సంస్థల్లోని వారికి గుర్తింపు.

కర్కాటకరాశి:ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి గురించి ఆలోచిస్తారు. ప్రదర్శనలు, సభలకు అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ, పనిభారం అధికమవుతుంది. స్త్రీలతో మితంగా మాట్లాడండి. పోస్టల్, ఎల్.ఐ.సీ ఏజెంట్లకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఉత్సాహం అధికరం.

సింహరాశి:  ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన వార్త అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుంది. పెద్దలతో సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. సాంకేతిక - వైద్య రంగాల్లోని వారికి అనుకూలం. పొదుపు చేస్తారు. సంతానంపై నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ఇతరుల జోక్యంతో చికాకులు.

కన్యరాశి: పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రణాళికబద్దంగా వ్యవహరించి ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఎలక్ట్రిక్ - ఎలక్ట్రానిక్ - కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదొకటి. జరిగేది ఒకటి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి.

తులరాశి: ఆర్థిక వ్యవహారాలపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు లావాదేవీలు లాభిస్తాయి. బీమా వ్యవహారాలకు అనుకూలం. బ్యాంకింగ్, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తి - వ్యాపారాలకు సంతృప్తికరం. రాజకీయ పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. పత్రిక, వార్త సంస్థల్లోని వారికి ఓర్పు - అంకితభావం ముఖ్యం.

వృశ్చికరాశి: దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పడుతుంది. సినీ రాజకీయ రంగాల వారు దూకుడు తగ్గించాలి. లక్ష్య సాధనకు పరిచయాలు తోడ్పడుతాయి.  సమావేశాలు - బృంద  కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐరన్ - ఆటోమోబైల్ - ట్రాన్స్ పోర్టు - మెకానికల్  రంగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. అతిగా మాట్లాడితే గొడవలకు ఆస్కారం.

ధనురాశి: వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వైద్యం - హోటల్ - రిటైల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. విద్యార్థులకు నూతన పరిచయాలతో సంతృప్తి. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలతో సమస్యలు. ఉన్నత విద్యల కోసం చేసే యత్నం ఫలిస్తుంది.

మకరరాశి: నైపుణ్యాలను మెరుగుపరుచుకొని లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో సంకల్పం నెరవేరుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిట్ ఫండ్ లు - డిపాజిట్లపై ఆశించిన రాబడి రాక నిరాశకు గురవుతారు. ధన వ్యయం, విరాళిలచ్చే విషయంలో మెలకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.

కుంభరాశి: ఇంటా బయటా ఒత్తిడి, చికాకులు ఎక్కువవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు. రావలసిన ధనం అంది తాకట్టు విడిపిస్తారు. కంప్యూటర్ - ఎలక్ట్రానికల్ - మెకానికల్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. అపరిచిత వ్యక్తల పట్ల ఏకాగ్రత అవసరం. బదిలీల విషయంలో వ్యూహాత్మకంగా లక్ష్యం సాధిస్తారు.

మీనరాశి: మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరీ - సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు. చెక్కులు, విలువైన డాక్యుమెంట్లు అందడంలో జాప్యం వల్ల నష్టపోతారు. స్టేషనరీ - రవాణా - బోధన - ఏజెన్సీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.  వృత్తి - వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. భాగస్వామిక చర్చల్లో మీ సూచనలకు మంచి స్పందన. పుణ్యక్షేత్ర సందర్శనాలు, దూర ప్రయాణాలకు అనుకూలం.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS