• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 23 ఆదివారం...

సెప్టెంబర్ 23 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-23 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: సినీ - రాజకీయ - గ్రానైట్ - ఫొటోగ్రఫీ - కళారంగాల వారికి లక్ష్యసాధనలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి.   సమావేశాల్లో నిదానం పాటించాలి.  భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. ధనం వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిన్నతరహా - చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయానం.. పుణ్యకార్యాల పై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు.

వృషభరాశి: సన్నిహితుల ఆరోగ్యం కలవరం కలిగిస్తుంది. యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. సమావేశాలు - వేడుకల్లో ఖర్చులు అంచనాలు పెరుగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయాభివృద్ధి - మానసిక ప్రశాంతత - సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రమోషన్స్ కు అవకాశం. 

మిథునరాశి:  వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. శ్రమాధిక్యం అవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్తాపం. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకత లోపించడంతో ఫలితాలు రావు. మీపై అభియోగాలు తొలిగిపోవు. ఖర్చులు అధికమవుతాయి. వ్యవహారిక ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి.  దూరప్రయాణాలతో ఉపయోగం.

కర్కాటకరాశి: ఇంటి వస్తువులు సమకూర్చుకుంటారు. సమావేశాలు - బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లకు ఆటకం.  రక్షణ - న్యాయ - బోధన రవాణా రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుత్సాహం కలిగిన సత్ఫలితాలు ఉంటాయి. కోర్టు వాయిదాలు పడడం మంచిది. విద్యార్థుల సాహస ప్రయత్నాలు విరమించండి.

సింహరాశి: పెట్టుబడుల గురించి సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిడికి గురవుతారు. బిల్లులు - చెక్కులు అందడంలో జాప్యం వల్ల నష్టపోతారు. పనులు నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులకు పరిచయాలు, నూతన వాతావరణం ఉత్సాహం కలిగిస్తాయి.

కన్యరాశి: బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. భాగస్వామిక ఆర్థిక విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. వేడుకల్లో మాటలు పడుతారు. ఆకస్మిక ఖర్చులవుతాయి. ధనం వ్యయం మితంగా చేయండి. గృహ నిర్మాణ పనుల ప్రారంభంలో మందగమనం. అవివాహితులకు శుభదాయకం.  ఆల్కహాల్ - సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి.

తుల రాశి: ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. హోటల్ - ఆస్పత్రులు - రిటైల్ రంగాల వారికి కొత్త ప్రయోగాలు చేసేందుకు తగిన సమయం కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి - ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఉద్యోగ - విద్య ప్రకటనల పట్ల అవగాహన పెంచుకోండి.

వృశ్చికరాశి:  దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. మంచి సమాచారం అందుతుంది. ఉన్నత విద్య - విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ - శాస్త్ర - సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు - మార్పులు - చేర్పులు - మరమ్మతులకు అనుకూలం.

ధనురాశి: కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వేడుకలు - సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి  అడుగువేయాలి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడుతాయి. పెట్టుబడులకు అనుకూలం.

మకరరాశి: కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటర్వ్యూలు - వృత్తిపరమైన ప్రయాణాలు ఫలించకపోవచ్చు. వృత్తి - వ్యాపారాల్లో మాటలు పడాల్సి రావచ్చు.  కొబ్బరి - పండ్లు - పూలు - కూరగాయలు - చిరు వ్యాపారులకు కలిసి వస్తుంది. కోళ్ల - మత్స్య - గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.

కుంభరాశి: రక్షణ - న్యాయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులు - రుణాల విషయంలో అంచనాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం. దంపతుల మధ్య అనోన్యత నెలకొంటుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో ఓర్పు - నేర్పు చాలా అవసరం.

మీనరాశి: దానధర్మాలకు ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. సంస్మరణాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. రుణ ప్రయత్నాలు - పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయండి. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకులు - సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS