కూతుర్ని కాల్చేయాలంటున్న బీజేపీ నేత

Update: 2016-02-22 06:58 GMT
అభిమానం ఫర్లేదు.. కానీ ఏ విషయంలోనూ దురభిమానం అస్సలు ఉండకూడదు. తమిళనాడు బీజేపీ నేత  హెచ్. రాజా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆవేశం హద్దులు దాటుతుందన్న భావన కలగటం ఖాయం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలన్న స్థానే.. ఎవరికి వారు తమకు తోచిన శిక్షలు వేయాలన్నట్లుగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. ఈ మధ్యన డిల్లీలోని జేఎన్ యూలో చోటు చేసుకున్న వివాదంలో కమ్యూనిస్ట్ నేత డి.రాజా కుమార్తె అక్కడి విద్యార్థులకు మద్దతుగా నిలవటం తెలిసిందే.

ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. బీజేపీ నేత హెచ్.రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేఎన్ యూలో ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ సభకు వెళ్లిన సీపీఐ నేత డి.రాజా కుమార్తెను కాల్చేయాలంటూ డి.రాజాను డిమాండ్ చేస్తున్న తీరు చూస్తే.. విస్మయం కలగక మానదు. తన కూతురే కనుక ఇలాంటి నిరసనల్లో పాల్గొని ఉంటే తాను కాల్చేసి ఉండేవాడినని వ్యాఖ్యానించారు. కూతుర్ని కాల్చి చంపేస్తేనే దేశం మీద ప్రేమ ఉన్నట్లుగా చేస్తున్న తాలిబన్ తరహా వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదన్న విషయాన్ని హెచ్. రాజా లాంటి వారికి అర్థమయ్యేలా బీజేపీ అగ్రనేతలు చెబితే బాగుండు. లేనిపక్షంలో బీజేపీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News