దిశ ఎన్ కౌంటర్: సారీ చెప్పిన నారాయణ

Update: 2019-12-08 10:52 GMT
దిశ ఎన్ కౌంటర్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడుతున్నానని.. ఇంతకుముందు చేసిన ప్రకటనపై ప్రజలకు, పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండడంతో తాను ఈ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గినట్లు నారాయణ తెలిపారు.

దిశ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు సీపీఐ నారాయణ స్పందించారు. ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. నిందితులకు సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు.

అయితే జాతీయ స్థాయిలో సీపీఐ పార్టీ ఎన్ కౌంటర్ ను ఖండించింది. పార్లమెంట్ లోనూ తప్పు పట్టింది. దేశంలోని కొంతమంది మేధావులు, మానవ హక్కుల సంఘం నేతలు ఈ సంఘటనను చట్టం కోణంలో పరిశీలించి తప్పుపట్టారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై అభ్యంతరం తెలిపారు.

కాగా సీపీఐ జాతీయ పార్టీ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్న నారాయణ ఎన్ కౌంటర్లను సమర్థించడంపై పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో నారాయణ ఎన్ కౌంటర్ పై చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ నారాయణ చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతలు తప్పుపట్టారు. దీంతో నారాయణ ఎన్ కౌంటర్ ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలపై పార్టీకి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పశ్చాత్తాప పడ్డారు.


Tags:    

Similar News