డాలర్ డ్రీమ్స్ కు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు నిర్ణయాలకు కోర్టు నో
భారతీయ టెకీలకు.. కంపెనీలకు ఇదో శుభవార్తగా చెప్పాలి. ట్రంప్ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాన్ని కోర్టు కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని కోర్టును కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి వరకు హెచ్ 1బీ వీసాల్ని రద్దు చేస్తూఅధ్యక్ష హోదాలో ట్రంప్ నిర్ణయం తీసుకోటం తెలిసిందే.
ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్.. బే ఏరియా కౌన్సిల్.. గూగుల్.. మైక్రోసాఫ్ట్.. లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. వీరి పిటిషన్ ను పరిశీలించి.. విచారించిన కోర్టు తాజా నిర్ణయాన్ని వెలువరించింది. వీసా విధానం మార్పులో ట్రంప్ సర్కారు పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు.
వీసా విధానంలో మార్పులపై చర్చించటానికి.. ప్రజల నుంచి అభిప్రాయాల్ని సేకరించటానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొంటూ తాజా తీర్పును ఇచ్చారు.డిసెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన ట్రంప్ వీసా అంవాల్నిఅమలు చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. కోర్టు తాజా ఆదేశం భారత టెకీలకు.. కంపెనీలకు శుభవార్తగా అభివర్ణిస్తున్నారు.