మోదీ చెప్పారు... దేశమంతా చప్పట్లు మారుమోగాయి
ప్రాణాంతక వైరస్ కోవిడ్- 19 కట్టడిలో భాగంగా దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిద్దామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటకు తిరుగే లేకుండా పోయింది. మోదీ మాటను మంత్రంగా పాటించిన దేశ ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై స్వీయ నర్భంధాన్ని పాటించారు. ఆ విషయాన్ని తెలియజేయాలన్న మోదీ మాటను కూడా గౌరవించిన దేశ ప్రజలు ఆదివారం సాయంత్రం ర గంటలు కాగానే ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ తమ ఇళ్ల ముందే నిలబడి చప్పట్లతో మారుమోగించారు. ఈ క్రమంలో దేశంలో ఎక్కడ చూసినా... 5 గంటల తర్వాత ఓ 15 నిమిషాలు, అరగంట పాటు చప్పట్లు మారుమోగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లతో కరోనాకు కట్టడి మాటను కాస్తంత గట్టిగానే వినిపించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్... తదితర నగరాల్లో దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇలా మోదీ మాట మేరకు చప్పట్లతో కరోనాను భయపెట్టిన వారిలో రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు పారిశ్రామిక రంగం, సినీ రంగానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన అందరు ప్రముఖులు కూడా చప్పట్లు చరుస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి.
కరోనాకు వీడ్కోలు పలికేలా నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున జనం చప్పట్లు చరిచారు. కరోనా విస్తృతి, దాని ప్రభావంతో ప్రాణాలొదులుతున్న రోగుల గురించి విస్తృత ప్రచారం నేపథ్యంలో నగర వాసుల్లోనే కాకుండా పల్లె సీమల ప్రజలు కూడా మోదీ మాటను వేద వాక్కుగా పాటించారనే చెప్పాలి. అత్యవసరం అని భావించిన పనులకు ఒకరో, ఇద్దరో బయటకు వచ్చినా.. దేశ ప్రజానీకం సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు పలికారనే చెప్పాలి. అంతేకాకుండా జనతా కర్ఫ్యూను తాము పాటించామని, కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న మాటను చెప్పేందుకు ప్రజలు ఉత్సాహం కనబరచిన నేపథ్యంలో దేశం యావత్తు జనం చప్పట్లతో మారుమోగిందని చెప్పక తప్పదు.