ఇలా అయితే.. కేడ‌ర్ పోరు సాగేనా? సోముపై విమ‌ర్శ‌ల వ‌ర్షం

Update: 2022-01-24 10:35 GMT
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేయాలి. ఇదీ ల‌క్ష్యం. దీనికి సంబంధించి పార్టీ కోసం ప్ర‌తి ఒక్క‌రూ రోడ్డెక్కాలి. అయితే... ఈ క్ర‌మంలో కేసులు పెడితే... ప్ర‌భుత్వం వారిని జైలుకు పంపితే.. ఎవ‌రు దిక్కు?  ఇదీ.. ఇప్ప‌డు బీజేపీలో కార్య‌క‌ర్త‌లు సంధిస్తున్న ప్ర‌దాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇటీవ‌ల క‌ర్నూలు జిల్లాలో ఒక మందిరానికి సంబంధించి జ‌రిగిన వివాదంలో బీజేపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవెంట‌నే ఆయ‌న‌ను జైలుకు త‌ర‌లించారు.

అయితే... ఇది జ‌రిగిన దాదాపు వారం అయిపోయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీకాంత్ రెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. బెయిల్ రాలేదా.. అస‌లు నాయ‌కులు ప్ర‌య‌త్నించ‌లేదా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ త‌ర‌పున కూడా చాలా మంది నాయ‌కుల‌పై కేసులు పెట్టారు. అవి అక్ర‌మ‌మా.. స‌క్ర‌మ‌మా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..ఇలా అరెస్ట‌యిన నేత‌ల‌ను పార్టీ త‌ర‌ఫున కాపాడుకున్నారు.. వారిని బెయిల్‌పై బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. దీంతో పార్టీపై కేడ‌ర్‌లో న‌మ్మ‌కం వ‌చ్చింది. పోలీసులు ఏదైనా కేసు పెట్టినా... పార్టీ ఉంది... కాపాడుతుంది? అనే భావ‌న‌తో ఉన్నారు.
Read more!

కానీ, బీజేపీలో మాత్రం ఆ త‌ర‌హా భ‌రోసా ఎవ‌రూ ఇవ్వ‌డం లేదు. పార్ల‌మెంటు స్థాయి ఇంచార్జ్‌నే ఇప్ప‌టి వ‌ర‌కు జైలు నుంచి బ‌య‌ట‌కు తెచ్చుకోలేక‌పోయిన రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వాన్ని ఎవ‌రు మాత్రం విశ్వ‌సిస్తారు?  ఎవ‌రు మాత్రం ధైర్యం చేసి రోడ్డెక్కుతారు? ఇదీ.. ఇప్పుడు  సోము వీర్రాజు స‌హా.. కీల‌క నేత‌ల‌ను పార్టీ నేత‌లు అడుగుతున్న ప్ర‌శ్న‌. నిజానికి ఈ విష‌యం ఒక్క‌టి చాలు.. బీజేపీ పుంజుకునేం దుకు.. శ్రీకాంత్‌రెడ్డిపై పెట్టిన కేసు నిల‌వ‌ద‌ని.. ఒక‌వైపు న్యాయ‌వాదులు సైతం చెబుతున్నారు.

కానీ, ఈ కేసులో ఆయ‌న‌ను విముక్తుణ్ని చేసుకునేందుకు మాత్రం బీజేపీ నాయ‌క‌త్వం ప్ర‌య‌త్నించ‌డం లేదు. దీంతో కేడ‌ర్‌పైనా ఈ ప్ర‌భావం ప‌డుతోంది. మ‌రి ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఇకపైనా కొన‌సాగితే.. బీజేపీ పుంజుకునేదెలా?  అధికారంలోకి వ‌చ్చేదెలా?  భ‌య‌ప‌డుతూ. ఎన్నాళ్లు పార్టీలో కార్య‌క‌ర్త‌లు ప‌నిచేస్తారు? ఇది కదా.. సోమును ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్ర‌శ్న‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News