మెదక్‌ జిల్లాలో దారుణం..ముక్కుపొడక కోసం శవాన్ని వెలికితీత!

Update: 2020-07-03 06:45 GMT
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ముక్కు పొడక కోసం అంత్యక్రియలు చేసి పూడ్చి పెట్టిన శవాన్ని తవ్వి బయటకి తీశారు.  ఈ దారుణ ఘటన గురువారం మెదక్‌ పట్టణం లో చోటు చేసుకుంది. ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే ...జూన్ 24 న  గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ అనారోగ్యం తో మృతి చెందింది.

దీనితో, స్థానిక గిద్దకట్ట శ్మశాన వాటిక లో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి కాటి కాపరి యాదగిరి సంబంధీకులు ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి రెండు బంగారు ముక్కు పుడకలు తీసుకున్నారు. ఆ సమయంలో అటువైపు గా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో  విషయం తెలుసుకున్న మృతురాలి కుమారుడు ఊశయ్య  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.
Tags:    

Similar News