• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో...

రాజధాని ఎక్స్‌ ప్రెస్‌ లో కరోనా కలకలం ... గాంధీ నుండి పారిపోయి ...

By - Tupaki Desk
Update: 2020-03-21 10:44 GMT
ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. మృతుల సంఖ్య 11,417కి చేరింది. గంటగంటకూ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 276462 మందికి కరోనా వైరస్ సోకగా ,ఇప్పటివరకూ 91954 మంది వైరస్ నుంచీ కోలుకున్నారు.  ఇక భారత్ లో కూడా ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఇండియా లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 కి చెరువు అవుతుండటం తో దేశ ప్రజానీకం మొత్తం తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే , తెలంగాణ లో కూడా కరోనా భయం అంతకంతకు పెరిగిపోతుంది.  వైరస్ విస్తరించకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన లోపం కనిపిస్తోంది. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ పలువురు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.   తాజాగా..ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు దంపతులు రైలులో ప్రయాణం చేస్తున్నారనే వార్త తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకుంది.  

వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా రాజధాని ఎక్స్ ప్రెస్ 2020, మార్చి 21వ తేదీ శనివారం వెళుతోంది. బీ 3 బోగీలో ఉన్న దంపతులను టీసీ గుర్తించారు. వీరి చేతుల మీదు ఐసోలేషన్‌ లో చికిత్స చేసినట్లుగా గుర్తించే ముద్ర ఉంది. దీనిని టీసీ గమనించి..ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పై అధికారులకు విషయాన్ని తెలియచేశారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ కు చేరుకొని, వారిని అదుపులోకి తీసుకున్నారు. 108 వాహనం ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు.

దీనితో బీ 3 బోగీలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైద్యాధికారులు అక్కడకు చేరుకుని రసాయనాలు చల్లారు. ఆ ప్రాంతమంతా శానిటైజర్ స్ప్రే చేశారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ దంపతులను స్క్రీనింగ్ టెస్టులు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రిలోని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే , ఐసోలేషన్ లో ఉండాల్సిన వారిద్దరూ ఒక్కసారిగా రాజధాని ఎక్స్ ప్రెస్‌ లో  ప్రత్యక్షం అవ్వడం కలకలం రేపింది.
Tags:    
  • Corona Virus 
  • people from China 
  • Latest Political News 
  • Latest National News 
  • political Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS