• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దేశంలో కరోనాపై షాకింగ్...

దేశంలో కరోనాపై షాకింగ్ నిజాల్ని బయట పెట్టారు

By - Tupaki Desk
Update: 2020-04-23 05:30 GMT
కరోనాకు సంబంధించినంత వరకూ ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. భారత్ లాంటి దేశంలో దాని తీవ్రత తక్కువనే చెప్పాలి. ముప్పును ముందుస్తుగా గుర్తించి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించటం ఒక ఎత్తు అయితే.. దేశంలోని నగర ప్రజలతో పోలిస్తే.. గ్రామీణ భారతావని అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించటం కూడా కరోనా తక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా చెప్పాలి. దేశ జనాభా.. మౌలికసదుపాయాలు తక్కువే అయినా.. కరోనా విషయంలో దేశ ప్రజల్లో నెలకొన్న అవగాహనతోనే.. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గర దగ్గర 20వేల కేసులకు వచ్చేసినప్పటికి.. విదేశాలతో పోలిస్తే.. మరణాల సంఖ్య తక్కువ కావటం ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది.

కరోనా బారిన పడిన వారికి సాధారణ వైద్యం తోనే 90 శాతం మంది కోలుకోవటం శుభసూచకంగా చెప్పాలి. అదే సమయంలో కేవలం ఒక్క శాతం రోగులు మాత్రమే వెంటిలేటర్ల ద్వారా చికిత్స పొందుతున్న ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు భారత వైద్య పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గంగా కేడ్కర్ వెల్లడించారు. బుధవారం వరకూ నమోదైన 19,484 కేసుల్లో ఇప్పటి వరకూ 3,870 మంది కోలుకోగా.. 640 మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధికులు పెద్ద వయస్కుల వారే.  మరణాలు చోటు చేసుకున్న వారిలో దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరోనా బారిన పడి కూడా 69 శాతం మందిలో వైరస్ లక్షణాలు కనిపించక పోవటానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ బారిన పడిన వారు 14 రోజుల్లోపు బయటపడుతుండగా.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నాలుగు రోజుల్లోనే బయటపడుతున్న విషయాన్ని గుర్తించారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో పద్నాలుగు రోజలు తర్వాత కూడా లక్షణాలు బయట పడటం లేదని తెలుస్తోంది.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. దేశంలో కరోనా వ్యాప్తి వ్యాధి లక్షణాలు కనిపించని వారి నుంచి కూడా ఎక్కువగా ఉందన్న విషయాన్ని చెబుతున్నారు. అయితే.. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇదెంత శాతమన్న విషయాన్ని మాత్రం తేల్చాల్సి ఉంది. ఇప్పటివరకూ కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి.. ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే  పరీక్షలు చేస్తున్నారు. ర్యాండమ్ టెస్టు కానీ.. ఫూల్ టెస్టు కానీ చేస్తే తప్పించి.. దేశంలో కరోనా తీవ్రత ఎంతన్న విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఏమైనా.. కరోనా పాజిటివ్ విషయంలో మిగిలిన దేశాల కంటే భారత్ మిన్నగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS