• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పేరుకు అగ్రరాజ్యమే...

పేరుకు అగ్రరాజ్యమే కానీ..అమెరికన్ల కంటే మనమే చాలా బెటర్

By - Tupaki Desk
Update: 2020-05-12 08:10 GMT
బతికుంటే.. ఇవాళ కాకుంటే రేపైనా చేయొచ్చు. అర్థాంతరంగా చచ్చిపోయి సాధించేదేమీ లేదు. నీ వల్ల ఎదుటోడికి ముప్పు అన్నప్పుడు.. నీ సుఖం.. సంతోషాన్ని కాస్త పక్కన పెట్టి.. చుట్టూ ఉన్న వారందరి గురించి ఆలోచించాలన్న చిన్న పాయింట్ అగ్రరాజ్యమైన అమెరికాలో మిస్ అవుతుందా? అంటే అవునని చెప్పాలి. ఇవాల్టి రోజున ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధిక పాజిటివ్ లు నమోదైన దేశాల్లో అగ్రరాజ్యం అగ్రభాగాన ఉండటాన్ని మర్చిపోకూడదు. ఎందుకిలా అంటే.. అమెరికాకు ఆర్థిక వ్యవస్థ బాగుండటమే కావాలి. డబ్బులే కానీ మనుషులు.. వారి ప్రాణాలతో పెద్దగా పని లేదన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం గురించి తెలిసినంతనే అమెరికా సర్కారు.. రెండు లక్షల మంది చనిపోతారన్న లెక్కలు వేసుకుందే తప్పించి.. ప్రాణాలు పోయే పరిస్థితికి చెక్ పెట్టే అంశం మీద ఫోకస్ పెట్టలేదన్న మాట పలువురి నోట వినిపించటాన్ని మర్చిపోకూడదు. అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో కొందరు అమెరికన్లు వ్యవహరిస్తున్న ధోరణి చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అమెరికాలో లాక్ డౌన్ అమలు ఆలస్యంగా మొదలు కావటంతోనే పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటమే కాదు.. భారీ సంఖ్యలో ప్రాణాలు పోవటాన్ని మర్చిపోకూడదు.

ఇంత జరుగుతున్నా.. ఆ దేశంలోని ప్రజలు జిమ్ లు.. ఫిట్ నెట్ సెంటర్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేయటమే కాదు.. రోడ్ల మీద ఆందోళన చేస్తున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు రావొద్దురా బాబు అంటూ.. మెత్తుకోవటమే కాదు.. ఒకవేళ వచ్చినా భౌతిక దూరాన్ని పాటించాలన్న మాటను పక్కన పెట్టేసి.. జిమ్ లు.. ఫిట్ నెస్ సెంటర్లు లాంటివి తెరవాలన్న డిమాండ్లను తెర మీదకు తీసుకురావటం ఏమిటన్నది ప్రశ్న.

అమెరికన్లతో పోలిస్తే..మనోళ్లు చాలా బెటర్ అని చెప్పాలి. ఇప్పటికిప్పుడు ప్రజాసర్వే నిర్వహించినా.. లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలనే చెబుతున్నారు. నిజమే.. కొన్ని వర్గాల ప్రజలు ఆకలితోనూ.. ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్నా.. తమ కష్టానికి తమకు తాము కుమిలిపోతున్నారే తప్పించి.. పక్కనున్నోళ్లకు ప్రమాదకరంగా పరిస్థితుల్ని మార్చాలనుకోవటం లేదన్నది మర్చిపోకూడదు. పేరుకు అగ్రరాజ్యమే తప్పించి.. ఆ దేశంలోని ప్రజల మనసులు కూడా చిన్నవేనన్న విషయం తాజా నిరసనల్ని చూస్తేఅర్థం కాక మానదు. వారితో పోలిస్తే.. పేదలు ఎక్కువగా ఉన్న మనలాంటి వర్థమాన దేశంలోని ప్రజలే చాలా బెటర్ అని చెప్పక తప్పదు.
Tags:    
  • Corona Virus In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS