వణికిపోతున్న అమెరికా.. అన్నీ బంద్.. వర్క్ ఫ్రం హోమ్
అమెరికా వణుకుతోంది. కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతోంది. తాజాగా అమెరికా చరిత్రలోనే మరోసారి అధ్యక్షుడు ట్రంప్ దేశంలో నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్ హౌస్ తో సహా అన్నింట్లోనూ ఉద్యోగులను ఇంటికి పంపించింది. వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది.
ఇక కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టుకో రాదని సూచించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్ బుక్ తన ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరాయి. ఇక వేలాది మంది ప్రయాణికులతో కళకళలాడే న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్ కో, లాస్ ఏంజలిస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాల్లో మనుషులు లేక సందడి లేకుండా పోయింది. యూరోపియన్ దేశాల నుంచి విమానాలను రద్దు చేశారు. అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు మాత్రమే తగిన జాగ్రత్తలతో విధులకు హాజరవుతున్నారు.
అమెరికాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వేలాది తెలుగు విద్యార్థులు తిరుగుముఖం పడుతున్నారు. విమానా చార్జీలు పడి పోవడంతో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఇండియాకు తిరిగి వస్తున్నారు. భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉండడమే వారి రాకకు కారణం గా తెలుస్తోంది.
ఇక మార్చి నుంచి జూన్ వరకు అమెరికా, యూరప్ దేశాల పర్యటనను భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. 88శాతం మంది ప్రయాణికులు అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి.