బ్రేకింగ్: దుబాయ్ నుంచి వచ్చిన 20మందికి కరోనా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మళ్లీ వలసలతో ముదురుతోంది. ఇన్నాళ్లు ఎంత కంట్రోల్ చేసినా సాధ్యం కాని వైరస్ ఇప్పుడు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో మరింత వ్యాపిస్తోంది.
లాక్ డౌన్ వల్ల ఇతరదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాలను నుంచి విమానాల్లో తీసుకొస్తున్నారు. వందే భారత్ మిషన్ పేరిట కేంద్రం ఈ విమానాలను నడుపుతోంది. తాజాగా దుబాయ్ నుంచి మంగళూరుకు చేరుకున్న విమానంలో 20 మందికి కరోనా సోకినట్లు తేలిందని కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
179మంది ప్రయాణికులతో కూడిన విమానం దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వీరిందరికీ పరీక్షలు నిర్వహించగా.. 20మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 38 ఏళ్ల గర్భిణి కూడా ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వం మొత్తం 179మంది ప్రయాణికులను క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశించింది. బాధితుల్లో 15 మంది దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వారు. ఉడిపి జిల్లాలో 1032 కేసులు నమోదు కాగా.. 476మంది కోలుకున్నారు. 35మంది మరణించారు.