• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా...

వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి.. వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన రిపోర్ట్!

By - Tupaki Desk
Update: 2021-05-24 08:33 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మూలాల కోసం నిపుణులు ఏడాది నుంచి అధ్యయనం చేస్తున్నారు. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే ఉద్భవించిందనే వాదనలు ఎన్నో వినిపించాయి. కానీ చైనా వాటన్నింటినీ తోసిపుచ్చింది. వుహాన్ లోని ఓ చేపల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని తెలిపింది. కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం  మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కరోనా వైరస్ మూలాలపై చర్చించడానికి డబ్లూహెచ్వో సమావేశం కానుంది. అందుకు ఒక్కరోజు ముందు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన రిపోర్టును బయటపెట్టింది.

ప్రపంచంలో కరోనా వ్యాప్తి చెందడానికి ముందే వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు వైరస్ బారిన పడినిట్లు ఆ నివేదిక పేర్కొంది. అంతేకాదు వారు చికిత్స కోసం వైద్యులను సంప్రదించినట్లు తెలిపింది. ఆ శాస్త్రవేత్తలు పని చేసిన కాలం, అనారోగ్యానికి గురైన సమయం, చికిత్స వంటివి ఆధారాలతో సహా బయటపెట్టింది. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందని వస్తున్న ఆరోపణలపై పరిశోధనలు చేయడానికి ఈ నివేదిక అదనపు బలాన్ని చేకూరుస్తోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో డబ్లూహెచ్ వో విచారణపై అందరికీ అనుమానం నెలకొంది. వైరస్ మూలాలను కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తోంది. చైనా, డబ్లూహెచ్వో బృందాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచి పట్టలేదని, వుహాన్ లోని చేపల మార్కెట్ నుంచి ఉద్భవించిందని ప్రకటించాయి. తాజా రిపోర్టుతో అందరికీ అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నివేదికను అమెరికా చాలా సీరియస్ గా తీసుకోనుంది.

ఈ నివేదికపై అమెరికా ఇప్పటివరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి తెలిపారు. కానీ వాల్ స్ట్రీట్ నివేదికను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోనుందని తెలిపారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచే పట్టిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. చైనా వైరస్, వుహాన్ వైరస్ అని ఆయన అంటే డ్రాగన్ దేశం సీరియస్ అయింది. అలాంటిది వైరస్ మూలాలు కనుగొనడానికి డబ్లూహెచ్వోకు పూర్తిగా సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్ సమాచారం రహస్యంగా ఉంచుతోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
Tags:    
  • Corona spread 
  • Wuhan Lab 
  • Wall Street Journal sensational report 
  • Telugu News 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS