9566 మంది పోలీసులకు కరోనా

Update: 2020-08-02 11:00 GMT
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతం మహారాష్ట్ర. ముంబైలో అయితే ఇది కల్లోలంగా ఉంది. రోజురోజుకు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఇక కరోనాపై పోరులో అందరికంటే ముందుండే పోలీస్ శాఖలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో పోలీసులకు ఎక్కువగా కరోనా సోకుతుండడం కలవరపెడుతోంది.

ఆదివారం మహారాష్ట్ర వ్యాప్తంగా 9566 మంది పోలీసులకు కరోనా సోకినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా కారణంగా పోలీస్ విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9మంది ఉన్నతాధికారులు ఉండడం విశేషం. 94మంది సిబ్బంది ఉన్నారు.

తాజాగా మహారాష్ట్ర పోలీస్ శాఖలో 1929 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 7534 మంది పోలీసులు కోలుకున్నారు.

మహారాష్ట్రలో ఇప్పటిదాకా 4.31 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 15316 మంది కరోనా కారణంగా చనిపోయారు.


Tags:    

Similar News