చైనాలో కరోనా తీవ్రరూపం.. 10 లక్షల మంది మృతి?
చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి కరోనా కేసులు వెలుగు చూశాయి. ప్రజలంతా ఫ్లూ.. జ్వరం.. వాంతులతో ఆస్పత్రుల పాలవడంతో తొలుత దీనిని వైరల్ ఫీవర్ గా చైనా భావించింది. ఈ క్రమంలోనే అంతుచిక్కని లక్షణాలతో ప్రజలు మరణిస్తుండటంతో అప్పుడు చైనా దీనిని కరోనాగా గుర్తించి కఠిన చర్యలు చేపట్టింది. అయితే అప్పటికే కరోనా వైరస్ చైనాను దాటి ఇతర దేశాలకు పాకింది.
అమెరికా.. ఇటలీ.. బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు కరోనా ధాటికి విలవిల లాడిపోయాయి. కరోనా ఫస్ట్ వేవ్ లో అక్కడి ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషంట్లతో కిక్కిరిసిపోయాయి. అప్పటి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడతో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా కట్టడిలోనే ఉంది. ఒక్క చైనాలో మాత్రం కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చైనాలో ఒమ్రికాన్ వైరస్ ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అనుసరించింది. అయితే ఈ విధానం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి.
జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ఎక్కువగా కావడంతో చైనా ఇటీవల ఆ నిబంధనలను ఎత్తివేసింది. దీంతో గత 15 రోజులుగా చైనాలో లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలంతా చైనా ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) 2023లో చైనాలో 10 లక్షల మంది కరోనా మృతి చెందుతారని అంచనా వేసింది.
చైనాలో పెరుగుతున్న కేసులు చూస్తుంటే ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య తారస్థాయికి చేరుతుందని పేర్కొంది. జనాభాలో మూడో వంతు ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. చైనాలో ఒమ్రికాన్ వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుందని తెలిపారు. దీనిని ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసిన ఆపడం సాధ్యం కాదని ముర్రే స్పష్టం చేసింది. దీంతో చైనా సరిహద్దు దేశాలు సైతం ఒమ్రికాన్ వైరస్ పట్ల ముందస్తుగానే అప్రమత్తం అవుతున్నాయి.