ఐసీఎంఆర్ ప్రకటన.. కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్ లో ప్రజలు!
దేశంలో మళ్లీ కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. తగ్గినట్లుగా తగ్గుతూనే మరోసారి విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ కరోనా భయాలు మొదలవుతున్నాయి. పెరుగుతున్న కేసులు... కొవిడ్ ఫోర్త్ వేవ్ కు సంకేతం అని ప్రచారం జరుగుతోంది. కరోనా నాలుగో దశ వార్తలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ విషయంపై ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) స్పందించింది. కరోనా పోర్త్ వేవ్ పై భయం అక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న విషయాన్ని ఇటీవల డేటా వెల్లడిస్తోందని ఐసీఎంఆర్ తెలిపింది. దీన్ని ఫోర్త్ వేవ్ గా భావించలేమని, కొన్ని చోట్ల స్థానికంగా కేసులు ఎక్కువ అయ్యాయని వివరణ ఇచ్చింది.
ఆయా ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా కరోనా టెస్టులు చేయడం లేదు. తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు చేసినప్పుడు వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆ ప్రాంతంలో కరోనా అధికంగా ఉందని చెప్పలేము. అధిక సంఖ్యలో టెస్టులు చేసినప్పుడు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తేనే అక్కడ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావించాలి అని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీరన్ పాండా విశ్లేషించారు.
జిల్లాలో స్థాయిల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందన్న సమీరన్ పాండా... దాని ఆధారంగా యావత్ దేశం నాలుగో దిశగా వెళ్తున్నట్లుగా చెప్పడం సరికాదని అన్నారు. టెస్టింగ్ రేషియో ఆధారంగా కొన్ని లోకల్ స్థాయిల్లో కేసుల పెరుగుదలను గుర్తించాన్నారాయన. దాని అర్థం రాష్ట్రాలన్నీ కొవిడ్ గుప్పిట్లో ఉన్నట్లు కాదన్నారు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఆసుపత్రుల్లో చేరికలు పెరగలేదన్నారు. అదీ కాకుండా ఇంత వరకూ కొత్తి వేరియంట్ ఏది గుర్తించ నందున ఇప్పటి కప్పుడు నాలుగో వేవ్ వస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని ఆయన వివరణ ఇచ్చారు. కాగా పరీక్షలు తగ్గడం వల్ల పాజిటివిటీ రేటు ఒక్కోసారి పెరగవచ్చని చెప్పారు.
ఇది ఇలా ఉంటే.. భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. వారం క్రితం వరకు వెయ్యి లోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కొత్తగా 3 వేల 324 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది కొవిడ్ తో మరణించారు.