కరోనా దెబ్బకు రాష్ట్రాల అప్పులు.. కొండను తలపిస్తున్నాయిగా?

Update: 2020-12-02 07:30 GMT
మహమ్మారి దెబ్బ మామూలుగా లేదు. మనుషుల ప్రాణాలే కాదు.. ఆర్థిక వ్యవస్థను దారుణంగా ప్రభావితం చేసింది. వ్యక్తిగత బడ్జెట్లు తలకిందులు కావటం.. పలువురు అప్పులు పాలు కావటమేకాదు.. వ్యాపారులు కోలుకోలేనంత భారీ దెబ్బలు తగిలినట్లుగా చెబుతున్నారు. ఇదంతా నాణెనికి ఒక పార్శం. మరోవైపు.. ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు చూస్తే నోట మాట రాని పరిస్థితి.

పెద్దగా ప్రచారంలోకి రావటం లేదు కానీ.. కరోనా కారణంగా రాష్ట్రాల అప్పులు అంతకంతకూ పెరిగిపోతుున్నాయి. కొండను తలపించేలా మారిన అప్పుల కుప్పకు సంబంధించిన గణాంకాలు బయటకు వచ్చాయి. క్రిసిల్ పుణ్యమా అని తాజాగా విడుదలైన లెక్కలు వణికించేలా ఉన్నాయి. కరోనా కారణంగా పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటంతో.. అప్పులు చేయటం అంతకంతకూ ఎక్కువైంది. ఈఏడాది రుణ సమీకరణ భారీగా పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.

దీంతో.. రాష్ట్రాల అప్పుభారీగా పెరిగింది. ఇప్పుడున్న అప్పుల లెక్క చూస్తే.. రూ.68లక్షల కోట్లుగా చెబుతున్నారు. దశాబ్ద కాలంలో ఇదే గరిష్ఠమని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆర్థిక ఉత్పత్తి 2 నుంచి 4 శాతం వరకు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఓవైపు రాష్ట్రాల వసూళ్లు తగ్గిపోగా.. మరోవైపు రాష్ట్రాల అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్న వైనం ఆందోళనను కలిగిస్తున్నాయి.
Tags:    

Similar News