ఏపీలోనూ 'కరోనా' ఎఫెక్ట్.. మోడీకి జగన్ లేఖ

Update: 2020-02-01 04:48 GMT
ఏపీ సీఎం జగన్ ‘కరోనా’ వైరస్ పై సమీక్షించారు. కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న ఏపీకి చెందిన 35మంది యువకులను వెంటనే దేశానికి తీసుకు రావాలని శుక్రవారం కేంద్రాన్ని కోరారు. ఏపీకి చెందిన 35మంది వూహాన్ లో చిక్కుకున్నారని ఏపీ సీఎం జగన్ కు నివేదికలు రాగానే ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు.

ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్ రాసిన లేఖ.. చైనాలోని భారత రాయబార కార్యాలయాన్ని తర్వగా స్పందించేలా చూసి ఏపీ యువకులకు అవసరమైన సాయాన్ని అందించేలా చూడాలని కోరారు.

ఏపీకి చెందిన 35మంది గత ఏడాది ఆగస్టులో చైనాలో శిక్షణ కోసం వెళ్లారని.. పీవోపీటీఎల్ అనే టెక్నాలజీ కంపెనీ బృందంలో భాగంగా వీరు చైనాకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు.

పీవోపీటీఎల్ కంపెనీ 2019లో విశాఖపట్నంలో 35మంది తెలుగు విద్యార్థులకు ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చి తిరుపతిలోని ఎల్సీడీ టీవీ స్క్రీన్ తయారీ విభాగం లో పనికి కుదర్చిందని జగన్ వివరించారు. వీరికి ఆధునిక సాంకేతిక శిక్షణ కోసం వూహాన్ కు కంపెనీ తీసుకెళ్లిందని వివరించారు.

35మంది బాధిత యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. వారిని వెంటనే వూహాన్ సిటీ నుంచి ఇంటికి తీసుకు రావాలని జగన్ లేఖలో కోరారు.
Tags:    

Similar News