కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన డ్రై ఫ్రూట్స్‌ వాడకం!

Update: 2020-07-18 00:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తో ప్రతి ఒక్కరి జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి. సామాన్యుల నుండి అధికారుల వరకు .. ప్రజాప్రతినిధుల నుండి ప్రముఖల వరకు ఇలా వారు వీరు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కరోనా భారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా రోజరోజుకి నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. నిన్నమొన్నటి వరకు 20  వేల వరకు నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 30  వేలకి దాటిపోయింది. దీనితో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఇంకా ఈ కరోనా మహమ్మారి కి సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో ... కరోనా భారిన పడే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కరోనా సోకినా దాని నుండి సులభంగా బయట పడచ్చు అని , కాకపోతే  ఇమ్మ్యూనిటి పవర్  పెంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి పౌష్ఠిక ఆహారం తిని దృడంగా ఉంటే సులభంగా కరోనా నుండి కోలుకోవచ్చు అని చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో శక్తినిచ్చే బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ విక్రయాలు భారీగా పెరిగాయి. కరోనారాకముందు కంటే నెలకు వంద కిలోల డ్రై ఫ్రూట్స్‌ అమ్మే మేము ..ఇప్పుడు  150 కిలోల వరకు విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. బాదం, పిస్తా, వాల్‌ నట్‌ విక్రయాలు బాగా పెరిగినా ధరలు మాత్రం పెరగలేదని వ్యాపారస్తులు చెప్తున్నారు.  బాదం కిలో రూ.1200 నుంచి వెయ్యికి తగ్గిందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నేరుగా వెళ్లి కొనే పరిస్థితి లేదు. అమ్మే వాళ్లు సైతం నగదు చెల్లించే వారితోనే వ్యాపారం చేయడం మూలంగానే ధరలు తగ్గాయని చెప్తున్నారు. అలాగే , శొంఠి, యాలకులు, లవంగాలకు కూడా ఫుల్  డిమాండ్‌ ఏర్పడింది. ఏదేమైనా కరోనా పుణ్యమా అని  .. ఈ వ్యాపారస్తులకు వ్యాపారం ఫుల్ గా జరుగుతుంది.
Tags:    

Similar News