కరోనా నిర్దారణ పరీక్ష రూ.60.. అంత తక్కువకు ఎలానంటే?
మహమ్మారి కరోనాను నిర్దారించేందుకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నవి యాంటీ జెన్.. ఆర్టీపీసీఆర్. మొదటి పరీక్ష కేవలం అరగంట వ్యవధిలోనే ఫలితం వచ్చేస్తుంది. కాకుంటే.. సరిగా నిర్దారిస్తుందా? లేదా? అన్న సందేహాలు ఉంటాయి. వీటి నిర్దారణ సామర్థ్యం యాభై శాతం లోపేనని చెబుతారు. ఈ కారణంతోనే యాంటీజెన్ లో కరోనా నిర్దారణ కాకుంటే.. అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఆర్టీపీసీఆర్ పరీక్షకు వెళ్లటం తెలిసిందే.
ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటంతో పాటు.. టెస్టు రిజల్ట్ రావటానికి కనిష్ఠంగా 24 గంటలు.. గరిష్ఠంగా 48గంటలు కూడా పట్టటం తెలిసిందే. ఇలాంటివేళ.. ‘డ్రైస్వాబ్’ టెక్నాలజీతో కరోనా నిర్దారణ పరీక్షల్ని కేవలం 3 గంటల వ్యవధిలోనే తేల్చేయటం దీని ప్రత్యేకత. అంతేకాదు.. దీనికి అయ్యే ఖర్చుకూడా బాగా తక్కువ. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం రూ.45-60 మధ్యలో అవుతుందని చెబుతున్నారు. సీపీఎంబీ డెవలప్ చేసిన ఈ పరీక్షా విధానాన్ని కమర్షియల్ గా తయారు చేసేందుకు మెరిల్ డయాగ్నస్టిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. సీసీఎంబీ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
‘డ్రైస్వాబ్’ కిట్లను నెలకు 2 కోట్ల కిట్ల వరకు తయారు చేస్తామని మెరికల్ డయాగ్నస్టిక్స్ సంస్థ చెబుతోంది. దీంతో నిర్దారణ పరీక్షకు అయ్యే ఖర్చును మాత్రమే కాదు.. సమయాన్ని కూడా భారీగా తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ‘డ్రైస్వాబ్’ టెస్టు ఎలా ఉంటుంది? ఆర్టీపీసీఆర్ టెస్టుకు.. దీనికి మధ్యనున్న వ్యత్యాసం ఏమిటన్న సందేహం పలువురిలో కలుగక మానదు.
ఆర్టీపీసీఆర్ పరీక్షలో రెండు పొడువాటి పుల్లల్ని ముక్కు.. నోట్లో నుంచి ద్రవాల్ని సేకరిస్తారు. వాటిని వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియం ద్రావణంలో ఉంచి జాగ్రత్తగా తీసుకెళతారు. ఈ డ్రైస్వాబ్స్ టెక్నాలజీలో పొడవాటి పుల్లల్ని ముక్కు.. నోటి నుంచి సేకరిస్తారు. వాటిని ప్రత్యేకంగా ఎలాంటి ద్రావణంలో ఉంచాల్సిన అవసరం ఉండదు. పొడిగా ఉండే పుల్లల్ని తీసుకెళ్లి పరీక్షలు చేస్తారు. దీని ఫలితం కేవలం మూడు గంటల వ్యవధిలో వచ్చేస్తుంది. త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ డ్రైస్వాబ్స్ టెక్నాలజీ పుణ్యమా అని.. జేబులకు చిల్లులు పడకుండా ఉంటుందని చెప్పక తప్పదు.