కరోనా సీజనల్ వ్యాధులతో కలిసి ట్విండెమిక్‌గా మారుతుందా?

Update: 2021-10-10 12:30 GMT
క‌రోనా మ‌మ‌మ్మారి ఆవిర్భావించి ఏళ్లు గ‌డుస్తున్నా ఏదో ఒక ర‌కంగా భ‌య‌పెడుతోంది. క‌రోనాతో పాటు సీజ‌న్ వ్యాధులు పిడిస్తుండ‌డంతో జ‌నం ఆందోళ‌న చెందుతున్నారు.  క‌రోనా ట్విండెమిక్‌గా మారే ప్ర‌మాదం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం చూపుతోంది. ఇండియా చ‌లికాలం ప్రారంభమ‌వుతుండ‌గా, అమెరికాలో రెండో సీజ‌న్ ప్ర‌వేశించింది.

 అయితే ఇదే అమెరికాలో ఇప్పుడు కొత్త స‌మ‌స్య తెచ్చింద‌ని వైద్యాధికారులు చెబుతున్నారు.  అమెరికాలో చ‌లికాలం ప్రారంభం కావ‌డంతో క‌రోనా మ‌హ‌మ్మారితో పాటు ఇత‌ర వ్యాధులు సోకే ప్ర‌మాదం ఉంది.  ప్ర‌పంచ దేశాల‌లో క‌రోనాను పాండెమిక్ అంటుండ‌గా, సీజ‌న‌ల్ క‌లిసిస్తే ట్విండెమిక్ మారుతుంది.  దీనిని మేథ‌మేటిక‌ల్ మోడ‌ల్స్ తో అంచ‌నా వేస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. క‌రోనాపై పోరాడానికి తీసుకుంటున్న చ‌ర్య‌లే ప్లూకి అడ్డుక‌ట్ట వేస్తాయ‌ని వారి చెబుతున్నారు. ఇంగ్లండ్‌లో మూడు వారాల‌లో 20 ల‌క్ష‌ల మందికి బూస్ట‌ర్ వేశామ‌ని ఆ దేశం ప్ర‌క‌టించింది. క‌రోనా ముప్ప ఉన్న వారిని ఎంపిక చేసి బూస్ట‌ర్ డోస్ ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇండియాలో కొత్త‌గా 19వేల‌పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 3,39,35,309 క‌రోనా కేసులు ఉన్నాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్క‌వ‌గానే ఉంది. అండ‌మాన్ నికోబార్‌లో 24 గంట‌ల‌లో ఒక్క కేసు న‌మోదు కాలేదు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 10 కేసులు ఉన్న‌ట్టు నివేదిక‌లు చెబుతున్నాయి.

భార‌త దేశంలో మొత్తం 94.62  కోట్ల మందికి క‌రోనా వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ కోసం మూడి ప‌దార్థాలు స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఐక్య‌రాజ్య స‌మితిలో ఇండియా రాయ‌బారి తిరుమూర్తి పేర్కొన్నారు. భార‌త దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌రుతుంద‌ని, ముడిప‌దార్ధాలు అందించ‌డం ద్వారా వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేయొచ్చ‌ని పేర్కొంది.

ఐక్య‌రాజ్య స‌మితి ద్వారా ఈ ఏడాదిలో వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారికి శ‌నివారం రోజు 968 మంది ర‌ష్య‌లో  చ‌నిపోయ్యారు. గ‌త నెల చివ‌రి రోజు 100మందిపై క‌రోనాకు బ‌లి అయిన‌ట్టు అధికారులు నివేధిక‌ల‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆ దేశంలో 29వేల క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే బ్రెజిల్‌లో 6ల‌క్ష‌ల మంది క‌రోనా కాటుకు బ‌లయ్యారు. ఆ దేశంలో డెల్టా విస్త‌రిస్తున్న‌ట్టు అనుమానాలు ఉండ‌గా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేదు.

క‌రోనా ఒక‌వైపు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తుంటే కాంగోలో ప్ర‌మాద‌క‌ర‌మైన ఎబోలా సోకి ఓ బాలుడు మృతి చెందాడు.  ఐదు నెల‌లుగా ఒక్క కేసు న‌మోదు కానీ కాంగోలో ఎబోలా వైర‌స్ సోకి  బాలుడు మృతి చెండ‌డంతో ఆందోళ‌న క‌లిగిస్తుంది. గ‌తంలో ఈ వైర‌స్ బారిన ప‌డి ఆరుగురు మ‌ర‌ణించారు. వైర‌స్ సోకిన బాలుడి వైద్యం అందించిన ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌లేదు.  బాలుడు మృతి చెందిన త‌రువాత వైద్యుల ప‌రీక్ష‌ల‌లో ఎబోలా వైర‌స్‌గా గుర్తించారు. ఇలా ప్ర‌పంచాన్ని క‌రోనా, ఇత‌ర వ్యాదులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి.
Tags:    

Similar News