120 రోజుల్లో 6లక్షల అడుగులు రెడీ చేస్తారంట
ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించిన కీలక ఒప్పందంపై ఏపీ సర్కారు ఓకే చెప్పేసింది. జీ+7 విధానంలో నిర్మించాలని భావిస్తున్న ఈ సెక్రటేరియట్ భవనంలో తొలిదశలో జీ+1 విధానంలో డిజైన్ చేస్తారు. మొత్తం 24 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ నిర్మాణం తొలిదశలో మాత్రం ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. దీనికి సంబంధించిన టెండర్లను చంద్రబాబు సర్కారు ఓకే చెప్పేసింది.
అధికారికంగా ఒప్పందం చేసుకోవాల్సిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు అంశాలు కీలకంగా మారాయి. ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలంతో పాటు.. మిగిలినఅన్ని అవసరాల్ని కేవలం 120 రోజుల్లో (జూన్ 15 నాటికి) పూర్తి చేసేలా చేయటం ఒకటైతే.. చదరపు అడుగు నిర్మాణానికి రూ.3350 చొప్పున కంపెనీలకు ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఓకే చెప్పేయటం గమనార్హం.
ఏపీ రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామ పరిధిలో ఈ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించనున్నారు. జూన్ చివరి నాటికి హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులందరిని ఏపీకి తీసుకురావాలన్నఆలోచనలో ఉన్న ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లుగా తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. వాస్తవానికి ఈ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందం పూర్తి చేసి.. ఈ నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ధర విషయంలో చోటు చేసుకున్న ఇష్యూతో శంకుస్థాపన కార్యక్రమం ఆగింది.
తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చదరపు అడుగుకు రూ.3వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధం కావటం.. టెండర్లలో పాల్గొన్న రెండు కంపెనీలు చదరపు అడుగుకు రూ.3500 చొప్పున కోట్ చేయటంతో ధర విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు భారీగా సాగాయి. ఎట్టకేలకు ఏపీ సర్కారు చదరపు అడుగుకు రూ.3350కు ఓకే చెప్పటంతో ఏపీ సర్కారుకు.. నిర్మాణ కంపెనీల (ఎల్ అండ్ టీ - షాపూర్ జీ పల్లోంజీ) మధ్య ఒప్పందం ఓకే అయ్యింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.