సంచలనం రేపుతున్న కాంగ్రెస్ ? మోడీ పై వార్ !
మోడీని ఢీకొనడం కోసం కాంగ్రెస్ కష్టాలు పడుతోంది. ఎదుగూ బొదుగూ లేక ఇబ్బందులు పడుతోంది. విషమ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఉన్నట్టుండి గేర్ మార్చి కొత్త రూట్ లోకి వెళ్తోంది. ఆ విధంగా ప్రత్యర్థి పార్టీని మట్టి కరిపించాలని యోచిస్తోంది. అనుకున్నంత వేగంగా ఫలితాలు రాకున్నా నిరాశ చెందకూడదన్న నిర్ణయంలో భాగంగా ప్రతిరోజూ ఏపీ కాంగ్రెస్ తనదైన సెటైర్లు విసురుతూనే ఉంది. ఇంకా పలు సమస్యలపై మోడీ పరిష్కారం చూపని వైనంపై విమర్శాస్త్రాలను సంధిస్తూనే ఉంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ కన్నా బీజేపీ హుషారు మీద ఉంటుందని అంతా భావించారు. కానీ ఫలితాలు తరువాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయిన బీజేపీ శ్రేణులను ఎలా అయినా తట్టి లేపాలి అన్న సంకల్పంతో కాంగ్రెస్ పనిచేస్తోంది. ఆ విధంగా
తనదైన వాగ్దాటితో సోషల్ మీడియాను సరైన సమయంలో సరైన విధంగా వాడుకోవాలన్న తపనతో ఉంది. విశేషం ఏంటంటే ఈ దశలో జగన్ ను టార్గెట్ చేయకుండా మోడీని మాత్రమే అదే పనిగా టార్గెట్ చేస్తుండడం. అంటే ఏపీ కాంగ్రెస్ వర్గాలు జగన్ ను పెద్దగా ఏమీ అనకూడదు అనే నిర్ణయించుకున్నాయా?
కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా వేగం పెంచింది. అనుకున్న దాని కన్నా ఎక్కువ వేగంతోనే పనిచేస్తోంది. ఏపీ కాంగ్రెస్ (ఎఫ్బీలో సోషల్ మీడియా పేజ్ ) మామూలుగా కాదు ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తోంది. దేశానికి మోడీ చేసిందేం లేదని ఒక్క మాటలో తేల్చేస్తూ తనదైన స్టైల్ లో హవాను కొనసాగిస్తోంది.
గత కొద్దికాలంగా మోడీ విధానాలపై కాంగ్రెస్ పోరాడుతున్నా కూడా ఇటీవల కాలంలో ఆ జోరు ఎందుకనో మరింత పెరిగి, విధాన నిర్ణయాలపై విపరీతంగా నోరేసుకుపడిపోతోంది. దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలపై ప్రచారం కాదని అంతకుమించి చేయాల్సింది ఎంతో ఉందని చెప్పకనే చెబుతోంది. మోడీ నిర్ణయాల కారణంగా దేశం అభివృద్ధి సాధించకపోగా వెనుకంజ వేస్తోందని అంటోంది. తిరోగమన రీతిలో ఫలితాలన్నవి ఉంటున్నాయని వాపోతోంది.
తాజాగా పెట్రోలు ధరల పెంపుపై మండిపడుతోంది. ఆరు రోజుల వ్యవధిలో ఐదో సారి పెట్రోల్ ధరలు పెంచిన ఘనత మోడీదేనని పేర్కొంటూ ఇడియట్ సినిమా లో రవితేజ గేటప్ ను పోలిన విధంగా మోడీ ఫేస్ ను డిజైన్ చేసి ఆ సినిమా పోస్టర్ ను పోలిన పోస్టర్ ను ఒకటి తయారు చేసి విడుదల చేసింది. మోడీ చర్యల ఫలితంగా ఆరు రోజుల్లోనే పెట్రో ధర మూడు రూపాయల డబ్బై పైసలు, డీజిల్ ధర మూడు రూపాయల 75 పైసలు పెరిగిందని,ఇదే ప్రస్తుత పరిణామ గతులకు నిదర్శనం అని పెదవి విరుస్తోంది.