మోడీ పాలనపై కాంగ్రెస్ పుస్తకం.. ఏముందంటే!
ప్రధానిగా నరేంద్ర మోడీ.. కేంద్రంలో చక్రం తిప్పడం.. ప్రారంభించి.. ఎనిమిదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు.. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకురెడీ అయ్యారు. భారీ ఎత్తున దేశంలో మోడీని, ఆయన పాలనను ఆకాశానికి ఎత్తేలా.. కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. అయితే.. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు.. మోడీ ఎనిమిదేళ్ల పాలనపై ఒక పుస్తకాన్నిప్రచురించింది.
`8 సాల్, 8 ఛాల్, బీజేపీ సర్కార్ విఫల్` పేరుతో కాంగ్రెస్ నాయకులు పుస్తకాన్ని విడుదల చేసింది. గత మోడీ పాలనలో తీసుకువచ్చిన నోట్ల రద్దు, కరోనా.. ఆర్థిక వ్యవస్థ పతనం, అప్పులు.. మత విద్వేషాలు.. పాకిస్థాన్‌తో భారత వైఖరి.. ఇలా అనేక విషయాలను.. పుస్తకంలో ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించింది. అన్ని రంగాల్లో దేశం నాశనమైందని, ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల సంపద మాత్రమే భారీగా పెరిగిందని ఆరోపించింది.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లయిన సందర్భంగా.. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అన్ని రంగాల్లో విఫలమైందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించింది. ఈ ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం.. అబద్ధాలు, అసత్య హామీలు, తప్పుడు ప్రకటనలు, నకిలీ నినాదాలతో ప్రజలను మోసం చేస్తూనే ఉందని కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
డిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం చేసిన 'అచ్చే దిన్' నినాదం.. బీజేపీకి, కొంతమంది కోటీశ్వరులైన పారిశ్రామికవేత్తలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. 8 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ హిందీలో ఓ బుక్లెట్ను విడుదల చేసింది కాంగ్రెస్.
'8 సాల్, 8 ఛాల్, బీజేపీ సర్కార్ విఫల్' (8 ఏళ్లు, 8 మోసాలు, బీజేపీ ప్రభుత్వం విఫలం) అనే పేరుతో మోడీ సర్కార్ వైఫల్యాలను హైలైట్ చేసింది. చైనా తరచూ మన సరిహద్దుల్లోకి చొరబడుతోందని, 8 సంవత్సరాల బీజేపీ పాలనలో మన దేశ సార్వభౌమాధికారం, భద్రతకు నిరంతర ముప్పు ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా. అయినా మోడీ మాత్రం మౌనం వీడట్లేదని ఆరోపించారు.
'8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం నాశనమైంది. మోడీ స్నేహితులు మాత్రమే ధనవంతులయ్యారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. మోడీ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరగడం, రైతులపై దాడులు, రూపాయి విలువ పతనం, భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇలా అన్ని రంగాల్లో దేశం నాశనమైంది. మోడీ అచ్చేదిన్ అనేది ఫ్లాప్ సినిమా. 84 శాతం భారతీయుల ఆదాయం పడిపోయింది. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. కానీ. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల సంపద మాత్రం భారీగా పెరిగింది. కొవిడ్ సమయంలోనూ.. రోజుకు రూ. వెయ్యి కోట్లకుపైగా ఆర్జించారు. అని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.