మోడీ గుట్టును విప్పేసిన కాంగ్రెస్...

Update: 2022-05-22 07:45 GMT
ముందు ధ‌ర‌లు పెంచి త‌రువాత త‌గ్గించి ఆ త‌రువాత పెంచి, ఆ త‌రువాత త‌రువాత త‌గ్గించి ఓ అంకెల డ్రామా ఆడ‌డంలో ఏ మ‌యినా అర్థం ఉందా ? ఇదంతా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను పోలి ఉంది అని విమ‌ర్శిస్తోంది కాంగ్రెస్.

పెట్రో ధ‌ర‌ల త‌గ్గింపుపై అస్స‌లు కేంద్రానికి అనుకూలంగా ఒక్క‌టంటే ఒక్క మాట కూడా రావ‌డం లేదు స‌రిక‌దా ధ‌ర‌ల త‌గ్గింపు పై ఎవ‌రి భాష్యం వారు వినిపించి, బీజేపీకి వ్య‌తిరేకంగా, త‌మ‌కు అనుగుణంగా అనుకూలంగా ప‌రిణామాలు మార్చుకుంటుండ‌డం విశేషం. ఇదంతా త‌మ ఘ‌న‌తే అని తెలంగాణ రాష్ట్ర స‌మితి బీరాలు పోతోంది. త‌మ అధినేత కేసీఆర్ చేపట్టిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న కార‌ణంగానే మోడీ త‌న నిర్ణ‌యం లో మార్పులు చేసుకుని, పెట్రో ధ‌ర‌లు త‌గ్గించార‌ని, త‌న‌పై వస్తున్న వ్య‌తిరేక‌త‌ల‌ను త‌గ్గించేందుకు ఇది ఒక దిద్దుబాటు చ‌ర్య‌లాంటిద‌ని కూడా అంటోంది టీఆర్ఎస్.

కాంగ్రెస్ పార్టీ జోరు పెంచి   మోడీని భలే ఇర‌కాటంలో పెడుతోంది. అనేక విష‌యాల‌పై విస్తృత రీతిలో మాట్లాడుతూ వీలున్నంత వ‌ర‌కూ గ‌ణాంకాలు ఇస్తోంది. ఆ విధంగా ఏపీ కాంగ్రెస్ (సోష‌ల్ మీడియా వింగ్) కాస్త తెలివికి ద‌గ్గ‌ర‌లో ఉన్న మాట‌లే చెబుతోంది. ఆలోచిస్తే..

"గ‌త ఏడాది, నవంబర్ లో 108 రూపాయలు ఉన్న పెట్రో ధరలను ఒకేసారి ఐదు రూపాయలు తగ్గించి 103 చేశాడు. మార్చ్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు అవ్వగానే రయ్ మ‌ని పద్దెనిమిది రూపాయ‌లు లేపి 121 రూపాయలకు తీసుకు వెళ్లాడు. ఇప్పుడు ఆ ధ‌ర‌ను కాస్త ఎనిమిదికి తగ్గించి 111 చేసి పెద్ద ఉద్దారక లెవల్లో హైప్ ఇస్తున్నాడు అని అంటోంది..మోడీ ని ఉద్దేశించి..! ఇది ఏ విధంగా ఉందంటే గబ్బర్ సింగ్ సినిమాలో తన తమ్ముడిని కొట్టి పెద్ద మనుషుల మధ్య సారీ చెప్పమనే ఒప్పందం మీద సారీ చెప్పి, అటుపై మ‌ళ్లీ మ‌ళ్లీ త‌మ్ముడ్ని అన్న చిత‌క‌బాదిన వైనం మాదిరి ఉంది" అని అంటోంది.

వాస్త‌వానికి పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ఇప్ప‌టికిప్పుడు త‌గ్గించేందుకు ఆ రోజు మాదిరిగానే ఇప్పుడు కూడా ఎల‌క్ష‌న్లు ఉన్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల దృష్ట్యానే ఈ విధంగా మోడీ చేస్తున్నార‌ని అంటున్నారు కొంద‌రు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఐదు రాష్ట్రాల త‌రువాత ఏ విధంగా ధ‌ర‌లు పెరిగాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే డ్రామాలు న‌డుపుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు కొన్ని వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News