ఐఏఎస్‌ ల‌ ఆందోళన వెనుక కొత్త కోణం

Update: 2018-10-31 07:53 GMT
తెలంగాణ అప‌ద్ధ‌ర్మ‌ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పై కాంగ్రెస్ పార్టీ కొత్త ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టిందా? ఈ క్ర‌మంలోనే ఐఏఎస్‌ లో తిరుగుబాటు జ‌రుగుతోందా? అంటే ప‌లువర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రాష్ట్రంలోని స్థానిక ఐఏఎస్‌ లు అసంతృప్తితో ఉన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల వెనుక మాజీ ఐఏఎస్ అధికారి - ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు - ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు - ఆయన శిష్యుడైన ఓ ఐఏఎస్ ఉన్న‌ట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాలు ప్రచారంలో పెడుతున్నాయి. ఓ ఐఏఎస్ కాంగ్రెస్ పార్టీకి స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నాయి.

స్థానిక ఐఏఎస్‌ లు అసంతృప్తితో ఉన్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. దీనివెనుక‌ కొప్పుల రాజు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజు మంత్రాంగంలో భాగంగా ఓ ఐఏఎస్ అధికారి ఈ కార్యాచ‌ర‌ణ ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని మేఘాలయభవన్‌ లో అనేకసార్లు సమావేశమైనట్టు ప్రభుత్వానికి చాలాకాలం కిందటే సమాచారం అందింది. త్వరలో ఆయ‌న  వీఆర్ ఎస్ తీసుకుని - ప్రెస్‌ క్లబ్‌ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడమా? లేక ముందే ప్రభుత్వాన్ని విమర్శించి - వీఆర్ ఎస్ తీసుకోవడమా! అన్న అంశంపై కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రాజు ప్రోత్సహిస్తున్నారని - వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇదంతా చేస్తున్నట్టు విశ్లేషించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రెస్‌ క్లబ్‌ లో జరిగిన ఒక విలేకరుల సమావేశానికి స‌దరు ఐఏఎస్ హాజరయ్యారని - ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడి - తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి - ప్రభుత్వం చేత సస్పెండ్ చేయించుకోవాలన్నదే ఆయన కుట్ర అని అధికార పార్టీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నాయి.

అయితే, తెలంగాణలో త‌మ‌కు గౌర‌వం ద‌క్క‌డంలేద‌ని - వివ‌క్ష ఉంద‌ని...ఓ వ‌ర్గానికి చెందిన వారికే ప‌దోన్న‌తులు ద‌క్కుతున్నాయ‌నే ఐఏఎస్‌ ల ఆవేద‌నలో కూడా నిజం లేక‌పోలేద‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ‌కు ప‌దోన్న‌తులు - ముఖ్య‌మైన పోస్టింగ్‌ ల విష‌యంలో ఉద్దేశ‌పూర్వ‌క నిరాద‌ర‌ణ ఎదుర‌వుతుంద‌నే వారి ఆవేద‌న‌లో నిజం ఉందంటున్నారు. అందుకే వారు ఒక్క‌తాటిపైకి వ‌చ్చిన నిర‌స‌న తెలుపుతున్నార‌ని అంటున్నారు. స‌ర్కారుకు సార‌థ్యం వ‌హించిన పార్టీ విమ‌ర్శ‌లు గుప్పించే బ‌దులుగా సామర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు.

Tags:    

Similar News