సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్

Update: 2019-10-07 05:50 GMT
సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్!
హుజూర్ నగర్ బై పోల్ ను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో పార్టీ గెలవకపోతే అంతే సంగతులు అని ఆ పార్టీ వాళ్లు బాగా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం.

ఇటీవలే సీఎల్పీని కేసీఆర్ తన పార్టీలోకి విలీనం చేసుకున్నారు. ఇలాంటి నేఫథ్యంలో హుజూర్ నగర్ లో గనుక కాంగ్రెస్ ఓడితే, ఆ పార్టీ పట్ల ప్రజలకు ఎలాంటి జాలీ లేదని తేలిపోతుంది. అది స్వయానా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సీటు. ఇప్పుడు కూడా ఆయన భార్యే పోటీ చేస్తోంది.

నల్లగొండ ఎంపీగా నెగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో తన సీటును గెలిపించుకోలేకపోతే.. ఎంపీగా నెగ్గింది కూడా వృథానే అయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. ఆ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇలాంటి నేఫథ్యంలో హుజూర్ నగర్ సీటు  కాంగ్రెస్ కు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.
Tags:    

Similar News