రేవంత్ రెడ్డి కి ఉచ్చు బిగుసుకుంటోందా?

Update: 2020-03-02 17:30 GMT
తీగ దొరికింది.. ఆ తీగ లాగితే రేవంత్ రెడ్డి ఢొంక కదులుతోందా? పక్కలో బల్లెంలో మారిన కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డిని బుక్ చేయడానికి తాజాగా ‘గోపనపల్లి’భూములను సీఎం కేసీఆర్ అస్త్రంగా మార్చుకోబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

తాజాగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూదందా పై తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కార్ ఓ ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విచారణ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిసింది. స్థానికుల నుంచి సాక్ష్యాధారాలు కూడా లభిస్తుండడం తో రేవంత్ కు ఉచ్చు బిగుసుకుంటోందని సమాచారం.

రేవంత్ భూదందాపై ప్రత్యేకంగా విచారణ చేయించడం ద్వారా రేవంత్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మూడు రోజులుగా ఆర్డీవో చంద్రకళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి భూకబ్జాలు వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. 1955 నాటి నుంచి ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తూ విచారణ జరుపుతున్నారు. కోట్ల రూపాయల హైదరాబాద్ చుట్టు పక్కల భూములను రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారని సమాచారం. గోపనపల్లి చుట్టుపక్కల అక్రమాలు వెలుగు చూసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కబ్జాలతో చెరువులోకి నీళ్లు రాకుండా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారట.. భూ కబ్జాలు, రెవెన్యూ, వాల్టా చట్టాలు ఉల్లంఘించారని రేవంత్ సోదరులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి కబ్జా కు సహకరించిన డిప్యూటీ కలెక్టర్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పుడు రేవంత్ కు ఉచ్చు బిగుసుకున్నట్టేనని అర్థమవుతోంది.
Tags:    

Similar News