• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఊపిరి తీసుకోవటం కష్టంగా...

ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉందన్న భట్టికి స్పీకర్ ఏం చెప్పారు?

By - Tupaki Desk
Update: 2021-03-18 10:30 GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో వివిధ పార్టీల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం మామూలే. కరోనా కారణంగా సభలోని వారంతా ముఖానికి మాస్కు పెట్టుకోవటం తప్పనిసరి కావటం తెలిసిందే. దీంతో.. మాస్కు కష్టాలు అందరికి ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటు లేని వారికి.. దాన్ని పెట్టుకోవటం ఒక కష్టమైతే.. మాస్కు పెట్టుకొని మాట్లాడటం మరింత కష్టమైన పనిగా చెప్పాలి.

ఇలాంటి ఇబ్బందే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టికి ఎదురైంది. దీంతో ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో.. ‘ అధ్యక్షా.. మాస్క్ తీయొచ్చా? ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పీకర్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మాస్క్ తీయండి.. ఫర్లేదు.. కానీ మీకిచ్చే టైం లోపల ముగించండి అంటూ పేర్కొన్నారు.

దీంతో.. భట్టి స్పందిస్తూ.. సీఎంగారు ఎంతసేపైనా మాట్లాడొచ్చు.. మాకేమో మైక్ కట్ చేస్తారంటూ నిష్ఠూరాలు ఆడటం మొదలు పెట్టారు. సాధారణంగా అధికారపక్షానికి అసెంబ్లీలో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండటం.. విపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటం మామూలే. ప్రతి సమావేశంలోనూ ఈ అంశంపై తరచూ వాదన జరగటం.. విపక్షాల మాటను అధికారపక్షం పట్టించుకోకపోవటం తెలిసిందే.
Tags:    
  • Congress MLA 
  • Mallu Bhatti Vikramarka 
  • Telangana Assembly 
  • Telugu News 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS