మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించబోతున్నారట.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు

Update: 2022-10-13 15:41 GMT
కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీని తిడుతూ.. ఆపార్టీ నేతలపై అసమ్మతి రాజేస్తూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎప్పుడూ అసమ్మతి రాజేస్తూనే ఉంటారు.ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని ఓడించే కుట్ర జరుగుతోందంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుండా మనుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోందని జగ్గారెడ్డి ఆరోపించారు.

టీఆర్ఎస్ , బీజేపీ వ్యూహాత్మక రాజకీయ కలయికతో కాంగ్రెస్ మొదటి స్థానంలో గెలువద్దని.. రెండో స్థానం కూడా దక్కవద్దని ఆ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు లేనిపోని ఆరోపణలు చేసుకుంటున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు ఇది మునుగోడు ఓటర్లు గమనించాలని.. ఒక సమస్య పరిష్కారం విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్ మెంట్ టీఆర్ఎస్, బీజేపీలకు ఉండదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రానున్న కాలంలో ప్రజలకు మేలు చేసినవారు అవుతారని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని.. రైతులు సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే కుటుంబం కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజలు గమనించాలని.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతందని.. టీఆర్ఎస్ ఆశపెట్టి గెలిచే ప్రయత్నం చేస్తోందన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలవకుండా కుట్ర చేస్తున్నారని.. ప్రజలు ఆలోచించాలని.. పదిరోజుల సంతోషమా? భవిష్యత్ కోసం ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పై బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ కుట్రను ఛేదించి డబ్బులు ఎవరు ఇచ్చినా.. తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలతో హోరెత్తించారు.
Tags:    

Similar News