పెద్ద‌ప‌ల్లిలో ఆ పార్టీ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనా..!

Update: 2022-06-19 12:30 GMT
పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయా..? అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే ముందే ఇక్క‌డ గెలిచే పార్టీపై స్ప‌ష్ట‌త వ‌చ్చిందా..? గెలిచే అభ్య‌ర్థి ఎవ‌రో కూడా తేలిపోయిందా..? అంటే స‌ర్వేల‌న్నీ అవున‌నే ఘోషిస్తున్నాయి. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కేసీఆర్ కు ఇచ్చిన నివేదిక‌లో కూడా ఈ అంశాల‌న్నీ పొందుప‌రిచిన‌ట్లు తెలుస్తోంది.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ ముందంజ‌లో ఉన్న‌ట్లు ప‌లు స‌ర్వేల‌లో వెల్ల‌డైంది. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీతో చేజార్చుకున్న ఈ స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. గ‌తంలో కాంగ్రెస్ కంచుకోట‌గా ఈ ఉన్న ఈ స్థానాన్ని 2009లో టీడీపీ గెలుచుకొంది. ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌య‌ర‌మ‌ణారావు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ల‌ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు. 2014, 2018 ఎన్నిక‌ల్లో మాత్రం కారు జోరు చూపించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు విజ‌యం సాధించారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టాల‌ని భావిస్తున్నారు.

అయితే.. ఈసారి అక్క‌డ టీఆర్ఎస్ ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలుస్తోంది. ప‌దేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డం.. ద‌ళిత‌బంధు అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వ‌క‌పోవ‌డం.. కొత్త పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు మంజూరు చేయ‌క‌పోవ‌డం.. రైతుల‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీని ప‌ట్టించుకోక‌పోవ‌డం.. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల ఆశ‌లు నెర‌వేర్చ‌క‌పోవ‌డం.. వంటి ప‌లు స‌మ‌స్య‌ల‌తో ఇక్క‌డ టీఆర్ఎస్ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లుగా స‌మాచారం.

ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త చాలా ఉండ‌డంతో దాన్ని బీజేపీ అందిపుచ్చుకోవాల‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ ఆ పార్టీపై కూడా ప్ర‌జ‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కోల్ బెల్ట్ ఉద్యోగులు ఎక్కువ‌గా ఉండ‌డం.. బొగ్గు గ‌నుల్ని ప్రైవేటు ప‌రం చేయాల‌ని బీజేపీ చూస్తుండ‌డం.. పెరిగిన నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు, పెట్రో ధ‌ర‌లు, వంట నూనె, గ్యాస్ ధ‌ర‌ల‌తో గృహిణులు కూడా బీజేపీపై విముఖ‌త చూపుతున్నారు. బీజేపీ విధానాల ప‌ట్ల రైతాంగం కూడా వ్య‌తిరేకంగా ఉన్నారు. కేవ‌లం యువ‌త మాత్ర‌మే మోదీ పాల‌న ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక్క‌డ అన్ని వ‌ర్గాల‌కు ఆశాదీపంలా కాంగ్రెస్ క‌నిపిస్తోంద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. వ‌రంగ‌ల్ రైతు డిక్ల‌రేష‌న్ ప‌ట్ల రైతులు కూడా ఆ పార్టీపై సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ర‌చ్చ‌బండ పేరుతో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌య‌ర‌మ‌ణారావు నిత్యం ప్ర‌జ‌ల్లో తిరుగుతూ వారికి ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆయ‌న‌నే అభ్య‌ర్థిగా పెట్టేందుకు పార్టీ పెద్ద‌లు, పీసీసీ చీఫ్ రేవంత్ సానుకూలంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. క్రితం ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప మెజారిటీతో ఓడిన ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి కూడా వ్య‌క్త‌మ‌వుతోంద‌ట‌. దీంతో ఆ పార్టీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని పార్టీ శ్రేణులు.
Tags:    

Similar News