పాపం కాంగ్రెసోళ్లు.. బుక్కైపోయారు
100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. వరుసగా రెండు సార్లు ఓడిపోయింది. ఓడగొట్టేశారు. నాయకత్వ లేమి ఆ పార్టీని వెంటాడుతోంది.ఢిల్లీలో రాహుల్, తెలంగాణలో ఉత్తమ్ ఫెయిల్ అయ్యాడు. అయితే ప్రజా పోరాటాలతో మళ్లీ యాక్టివ్ కావాల్సింది పోయి ఇలా ‘గెస్ట్ రోల్ పాలిటిక్స్’ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బాగానే తలంటిందట అధిష్టానం. ఓ వ్యక్తి ఉచ్చులో పడి ఇలా అతడి క్రెడిట్ పెంచుతారా అని నిలదీసిందట.. ఇంతకీ అసలు కథ ఏంటంటే..
మాజీ ఎంపీ వివేక్. టీఆర్ ఎస్ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈయన కేసీఆర్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీనుంచి బయటకొచ్చారు. తెలంగాణ ప్రజావేదిక అంటూ ఒక సంఘం మొదలు పెట్టి ఎర్రమంజిల్, కొత్త సచివాలయ నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఈ కోవలోనే బీజేపీ లో చేరేందుకు అమిత్ షా దగ్గరకు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. కానీ ఆ పార్టీలో చేరలేదు. ఆషాఢం తర్వాత చేరుతానని చెప్పివచ్చాడని టాక్.
అయితే తెలంగాణలో సొంతంగా టీవీ, పత్రికను పెట్టుకున్న వివేక్ ఇప్పుడు కేసీఆర్ పోరుబాటకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యనే ఎర్రమంజిల్, సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, కోదండరాం తదితర ప్రజా సంఘాల నాయకులతో కలిసి గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చాడు. ఇక చలో సెక్రెటేరియట్ కు పిలుపునిచ్చాడు.
అయితే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని కేసీఆర్ పై కోపంతో వివేక్ చేస్తున్నారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు ఆయన ఇలా తన స్టామినాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని టాక్.. ఈ ఉచ్చులో పడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఆయన ఉద్యమానికి మద్దతిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా లీడ్ చేయాల్సిన కాంగ్రెస్ నేతలు ఇలా గెస్ట్ రోల్ గా వివేక్ ఉద్యమంలో కలిసి నడవడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. మీరు చేయాల్సింది అతడు చేస్తుంటే మద్దతు ఎందుకు ఇస్తున్నారని నిలదీసింది. దీంతో కాంగ్రెస్ నేతలు వివేక్ నిర్వహించే చలో సెక్రెటేరియట్ కు హాజరు కాలేదు. వివేక్ బీజేపీలోకి వెళ్లడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల్లో అంత సీనియారిటీ ఉన్న కాంగ్రెస్ నేతలు బుక్కైపోవడమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.