గుజరాత్ లో కరోనా వ్యాప్తికి కారణం 'నమస్తే ట్రంప్' ; కాంగ్రెస్

Update: 2020-05-07 06:00 GMT
దేశంలో కరోనా మహమ్మారి ఇప్పట్లో కట్టడిలోకి వచ్చేలా కనిపించడంలేదు. మహమ్మారి కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కాగా , దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆ ఆరువాత కరోనా ఎక్కువ కేసులు నమోదైయేది గుజరాత్ రాష్ట్రంలోనే.

అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన నమస్తే ట్రంప్ కారణమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్దా ఈ అంశంపై సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలోనే తాను గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు ప్రకటించారు. వీడియో మేసేజ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

జనవరిలోనే కరోనా వైరస్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని WHO ప్రకటించిందని, అయినప్పటికీ కూడా  బీజేపీ ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా లక్షల మందితో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమం కోసం వేలాది మంది విదేశీయులు కూడా గుజరాత్‌కు వచ్చారని, వారి ద్వారా రాష్ట్రంలోకి ఈ వైరస్ ప్రవేశించిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

ఆయన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ వాలా అన్నారు. ట్రంప్ ఏ దేశంలో పర్యటించడానికైనా ముందు అమెరికాకు చెందిన బృందం అక్కడ పర్యటించి సెక్యూరిటీతో పాటు ఆరోగ్య సంబంధమైన అంశాలను కూడా పరిశీలిస్తుందని వాలా తెలిపారు. ఆ బృందం ఓకే చెప్పిందే ట్రంప్ ఏ దేశంలోనూ పర్యటించరని స్పష్టం చేశారు .గుజరాత్‌లో ఇప్పటివరకు 6245 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 1381 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 368 మంది చని పోయారు.
Tags:    

Similar News